బాబుకి డయాబెటిస్‌... ఏం పెట్టాలి?

మా బాబుకి 7 సంవత్సరాలు. టైప్‌-1 డయాబెటిస్‌ ఉంది. రోజూ ఇన్సులిన్‌ ఇస్తున్నాం. వేసవి సెలవులు కావడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. రోజంతా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ సాయంత్రానికి నీరసంగా కనిపిస్తున్నాడు.

Updated : 09 May 2024 14:49 IST

మా బాబుకి 7 సంవత్సరాలు. టైప్‌-1 డయాబెటిస్‌ ఉంది. రోజూ ఇన్సులిన్‌ ఇస్తున్నాం. వేసవి సెలవులు కావడం వల్ల ఇంట్లోనే ఉంటున్నాడు. రోజంతా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ సాయంత్రానికి నీరసంగా కనిపిస్తున్నాడు. రోజూ ఆహారంలో ఎలాంటి నియమాలు పాటించాలి?

కుమారి, ప్రకాశం

సాధారణంగా పెద్దవాళ్లలో వచ్చే డయాబెటిస్‌కీ¨, చిన్నారుల్లో వచ్చే టైప్‌-1 డయాబెటిస్‌కీ¨ తీసుకునే ఆహారనియమాలు వేరుగా ఉంటాయి. 7 సంవత్సరాలంటే బాబుది ఎదిగే వయసు. కాబట్టి మామూలు పిల్లల మాదిరిగానే వీరికి అన్ని రకాల ఆహారాలు పెట్టవచ్చు. కాకపోతే ఇన్సులిన్‌ మోతాదు, దాన్ని ఇచ్చే సమయం, ఎత్తు, బరువుని దృష్టిలో పెట్టుకుని ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీటితో పాటు బాబు బ్లడ్‌ షుగర్‌ స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయేమో గమనించాలి. బరువు తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఆటలు ఎక్కువ ఆడుతున్నా.. కొత్త ఆటలు ఏమైనా మొదలు పెట్టినా కూడా చక్కెర స్థాయుల్లో మార్పులు రావచ్చు. వీరిలో ఇన్సులిన్‌ టైమ్‌ ప్రకారం పనిచేస్తుంది కాబట్టి ఆహార వేళలు తప్పక పాటించాలి. ఇచ్చే ఆహారంలో మాంసకృత్తులు, కార్బోహైడ్రేట్స్‌, పీచుపదార్థం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఉదయం అల్పాహారంగా.. పాలతో కలిపిన ఓట్స్‌, చపాతీ, పెసరట్టు, ఉడికించిన గుడ్డు పెట్టొచ్చు. మధ్యాహ్న భోజనంలో బ్రౌన్‌రైస్‌, దంపుడు బియ్యాన్ని మాత్రమే వాడాలి. వీటితో పాటు కాయగూరలతో కలిపి ఆమ్లెట్‌ పెట్టాలి. సాయంత్రం చిరుతిండిగా మొలకలు, నట్స్‌, వెజ్‌సూప్‌, ఉడికించిన శనగలు, గ్లాసు పాలు ఇవ్వాలి. రాత్రి భోజనంలో మిల్లెట్స్‌తో చేసిన రోటీ, పుల్కా, ఉడికించిన కాయగూరలు, కప్పు పెరుగన్నం పెట్టాలి. చక్కెర తక్కువ, పీచుపదార్థం ఎక్కువుండే  బత్తాయి, జామ, ఆరెంజ్‌, డ్రాగన్‌ఫ్రూట్‌ వంటివి పెట్టాలి. ఇవి కాకుండా వాతావరణ మార్పులకనుగుణంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి కాబట్టి డీహైడ్రేషన్‌కు గురికాకుండా ద్రవ పదార్థాలు ఇస్తూ ఉండాలి. ఐస్‌క్రీమ్‌, బేకరీ పదార్థాలకు దూరంగా ఉంచాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్