కొంచెం బద్ధకించండి..!

ఆఫీసు, కాలేజీల నుంచి వచ్చిన వెంటనే చాలామంది అమ్మాయిలు చేసే మొదటి పని... మంచం మీద పడుకుని పొర్లడమే కదా! ఇంత బద్ధకం పనికిరాదని అమ్మ చీవాట్లు పెడుతున్నా, మనకు మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే...

Updated : 18 May 2024 03:56 IST

ఆఫీసు, కాలేజీల నుంచి వచ్చిన వెంటనే చాలామంది అమ్మాయిలు చేసే మొదటి పని... మంచం మీద పడుకుని పొర్లడమే కదా! ఇంత బద్ధకం పనికిరాదని అమ్మ చీవాట్లు పెడుతున్నా, మనకు మాత్రం చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే... ఆ మెత్తని పొరల పరుపు మధ్యలో ఈ కాళ్లూ, చేతులూ అసలు మనవి కానట్లు చాపేసి పడుకుంటే... ఇంతకంటే విలాసం ఇంక ప్రపంచంలో ఏమీ లేదేమో అనిపిస్తుంది. బయట ఒత్తిళ్లన్నింటినీ వదిలేసి, ఓ ప్రశాంతలోకంలో విహరిస్తున్నట్లు ఉంటుంది. అంతేనా, ఆ సమయంలో మన గురించి మనం లోతుగా ఆలోచిస్తాం కూడా. ఎలాంటి డెడ్‌లైన్లూ, బాధ్యతల ఒత్తిళ్లు అసలే ఉండవు. ఆలోచనలు అలా స్వేచ్ఛగా అలల్లా, మదిలో ప్రవహిస్తుంటాయి. అదేంటో జీవితంలో ఉన్న సందిగ్ధతలన్నింటికీ ఆ సమయంలో తేలిగ్గా పరిష్కారాలూ దొరికేస్తాయి. దానికి తోడు బెడ్‌పై సౌకర్యంగా కూర్చొని, తొలి సూర్యకిరణాలు కిటికీ కర్టెన్‌గుండా మనల్ని తాకుతున్నప్పుడు లేదా చిటపట చినుకులు పడుతున్నప్పుడు... చేతిలో నురగలు కక్కే వేడివేడి కాఫీ ఉంటే అద్భుతః! అనిపిస్తుంది. అప్పుడు గడిపే ప్రతిక్షణం ఇంద్రియాలకు ఓ వేడుకలా ఉంటుందంటే అతిశయోక్తి కాదు! మరి దీనివల్ల ఇన్ని ప్రయోజనాలున్నప్పుడు అప్పుడప్పుడూ ఇలా సేదతీరితే తప్పేముందని అమ్మకూ చెప్పేయండి మరి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్