ఒంటరితనాన్ని వదిలించుకుందాం...

జీవనశైలి, పని ఒత్తిడి కారణాలేవైనా చాలామంది మహిళలను డిప్రెషన్‌ వేధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంటరితనం బాధించకూడదంటే... ఈ అలవాట్లు చేసుకోమంటున్నారు నిపుణులు.

Published : 25 May 2024 01:43 IST

జీవనశైలి, పని ఒత్తిడి కారణాలేవైనా చాలామంది మహిళలను డిప్రెషన్‌ వేధిస్తుంటుంది. ఇలాంటప్పుడు ఒంటరితనం బాధించకూడదంటే... ఈ అలవాట్లు చేసుకోమంటున్నారు నిపుణులు.

  • జీవితం ఎవరికీ పూల పాన్పు కాదు... ఎదురయ్యే సంఘటనల్ని డీల్‌ చేసుకునే విధానమే వారిని గట్టెక్కిస్తుంది. అలాకాకుండా అన్నింటికీ ఎవరో ఒకరి తోడు కావాలనుకోవడం, మనసుకి నచ్చిన వారు పక్కనుంటేనే అన్నీ చేయగలను అనుకోవడం వద్దు. మీ ఒంటరి తనం పోగొట్టడానికి ఏవైనా హాబీలను అలవాటు చేసుకోండి. ఉదాహరణకు మీకు మంచి ముగ్గులు పెట్టడమో, వంట చేయడమో వస్తే... దానిలోనే ప్రత్యేకత సాధించడానికి ప్రయత్నించండి. సామాజిక మాధ్యమాల వేదికగా వాటిని ప్రదర్శించండి. ఇవన్నీ మీకో గుర్తింపు తేవడమే కాదు.. ఒంటరితనాన్నీ దూరం చేస్తాయి.
  • నలుగురిలో కలవడానికి బోలెడు మార్గాలు.... వ్యాయామం చేయడానికి రోజూ దగ్గర్లోని యోగా సెంటర్‌కో, పార్కుకో వెళ్లండి. కసరత్తులు మీ ఒంటికి శ్రమనూ, మనసుకు సాంత్వననూ అందిస్తాయి. కొత్త స్నేహాలకూ, ఆలోచనలకూ ఇవి వేదిక అవుతాయి. లేదంటే ఉదయమో, సాయంత్రమో ఏ గుడికో వెళ్లండి. క్రమంగా మీలోని ఒత్తిడి దూరమవుతుంది.
  • మీలో ఒంటరితనం అనే భావన రావడానికి మీ చుట్టూ ఉండే వ్యక్తులూ, సమాజం... ఏదైనా కారణం కావొచ్చు. నిత్యం ఏదో ఒక ప్రతికూల పరిస్థితితో పోరాడాల్సి రావొచ్చు. అంతమాత్రాన మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. ఏ రోజుకారోజు మీలోని ఓ నెగెటివ్‌ అంశాన్ని అధిగమించాలనే లక్ష్యం పెట్టుకోండి. ఏ విషయంలోనైనా వెనకబడి ఉంటే అందులో పట్టు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ మీ ఒంటరితనాన్ని దూరం చేసేవే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్