ఆమె పాపకు రాసిన ఆస్తిని మేం మళ్లీ తీసుకోవచ్చా?

మాకో పాప, బాబు. మా ఆడపడుచుకి పిల్లల్లేరు. మమ్మల్ని ఒప్పించి నెలల వయసున్న మా పాపని పెంచుకోవడానికి తీసుకెళ్లింది. తనపేర ఎకరం పొలం కూడా రాసింది. ఆరునెలల క్రితం ఆమెకి బాబు పుట్టడంతో పాప పేరిట రాసిన ఆస్తిని రద్దు చేసిందట.

Updated : 28 May 2024 15:48 IST

మాకో పాప, బాబు. మా ఆడపడుచుకి పిల్లల్లేరు. మమ్మల్ని ఒప్పించి నెలల వయసున్న మా పాపని పెంచుకోవడానికి తీసుకెళ్లింది. తనపేర ఎకరం పొలం కూడా రాసింది. ఆరునెలల క్రితం ఆమెకి బాబు పుట్టడంతో పాప పేరిట రాసిన ఆస్తిని రద్దు చేసిందట. అందుకు చట్టం ఒప్పుకొంటుందా? ఈ విషయమై కోర్టులో కేసు వేయొచ్చా?

ఓ సోదరి

పాపను దత్తత ఇచ్చేటప్పుడు అడాప్షన్‌ డీడ్‌ రాసుకున్నారా? రాసుకుంటే అది రిజిస్టర్‌ అయ్యిందా? దత్తత స్వీకారం హిందూ ధర్మం ప్రకారమే జరిగిందా? మీ ఆడపడుచు పాప పేరిట రాసిన పొలం రిజిస్టర్‌ అయ్యిందా? వీటన్నింటికీ సమాధానాలు తెలియాలి. సాధారణంగా మైనర్‌ పేరిట రాసిన ఆస్తులను తిరిగి తీసుకునే హక్కు ఇచ్చిన వారికి లేదు. ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ప్రాపర్టీ యాక్ట్‌-122 ప్రకారం... ఏదైనా ఆస్తికి ఎటువంటి మూల్యం చెల్లించకుండా అవతలి వ్యక్తి సంపూర్ణంగా అనుభవించే హక్కు కలిగి ఉండేలా రాస్తే దాన్ని దానం అంటారు. అలా ఇచ్చేటప్పుడు... మైనర్‌ తరఫున ఆమె తల్లి లేదా గార్డియన్‌ అందుకు ఒప్పుకోవాలి. కానుక ఇచ్చేటప్పుడు ఏదైనా కండిషన్‌ పెట్టుకుని ఒకవేళ అది తీరకపోతే రీవోక్‌ (అధికారికంగా రద్దు) చేసుకోవచ్చు. దీనికి ఇచ్చేవారు తీసుకునేవారు కూడా అంగీకరించాలి. హిందూ మైనారిటీ అండ్‌ గార్డియన్‌షిప్‌ యాక్ట్‌-1956 ప్రకారం 18 ఏళ్లు నిండని వారిని మైనర్లుగా చెబుతారు. తల్లిదండ్రులు అయినా సరే మైనర్ల ప్రాపర్టీ అమ్మాలనుకుంటే సెక్షన్‌ 8 క్లాజ్‌(2) ప్రకారం కోర్టు అనుమతి తీసుకోవాలి. మీ విషయానికి వస్తే.. మీ పాప పేరున గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్టర్‌ అయి ఉంటే కోర్టు అనుమతి లేకుండా మార్పులు చేయడానికి వీలు లేదు. అలానే దత్తత హిందూ అడాప్షన్‌ అండ్‌ మెయింటెనెెన్స్‌ యాక్ట్‌ ప్రకారం జరిగి ఉంటే ఇచ్చినవారు గానీ, తీసుకున్నవారికి కానీ దానిని రద్దు చేసే హక్కు లేదు. తగిన ఆధారాలతో ముందు ఒక లాయర్‌ని సంప్రదించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్