ఇల్లు... మనసు... ఖాళీ!

పైచదువులు, ఉద్యోగాలంటూ పిల్లలు వేరే ప్రాంతాలు, దేశాలకు వెళ్లిపోతారు. వాళ్ల తోడే లోకంగా బతికేస్తారు కొందరు అమ్మలు. వారికోసం ఇష్టాలు, కెరియర్‌ వదిలిపెడతారు. అలాంటివారికి పిల్లలకు దూరంగా బతకడం ఎంత కష్టం? దీన్నే ‘ఎమ్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’గా చెబుతున్నారు నిపుణులు.

Published : 07 Jun 2024 01:30 IST

పైచదువులు, ఉద్యోగాలంటూ పిల్లలు వేరే ప్రాంతాలు, దేశాలకు వెళ్లిపోతారు. వాళ్ల తోడే లోకంగా బతికేస్తారు కొందరు అమ్మలు. వారికోసం ఇష్టాలు, కెరియర్‌ వదిలిపెడతారు. అలాంటివారికి పిల్లలకు దూరంగా బతకడం ఎంత కష్టం? దీన్నే ‘ఎమ్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’గా చెబుతున్నారు నిపుణులు.

పిల్లలకు టిఫిన్, పుస్తకాలు గుర్తుచేయడం, సమయానికి స్కూలు, కాలేజీకి పంపడం... వాళ్లలా అడుగు బయటపెట్టగానే వారి తాలూకూ పుస్తకాలు, దుస్తులు సర్దడం... తిరిగి సాయంత్రానికి స్నాక్స్, భోజనం సిద్ధం చేయడం... క్షణం తీరిక లేదన్నట్టుగా సాగుతుంది అమ్మల జీవితం. ఒక్కసారిగా పిల్లలు భవిష్యత్తు నిర్మించుకోవడానికని ఆమెకు దూరమయ్యాక బోలెడు ప్రశ్నలు వేధించడం మొదలుపెడతాయి. ఉరుకులు పరుగులుండవు. ఇల్లంతా బోసిగా కనిపిస్తుంది. ‘సరిగా తిన్నారో లేదో! ఏమైనా ఇబ్బంది పడుతున్నారేమో! సురక్షితంగా చేరుకున్నారో లేదో...’ ఇలా అనుకుంటూ భయపడటమే కాదు... ఏడ్చేస్తుంటారు కూడా. ఇవన్నీ ‘ఎమ్టీ నెస్ట్‌ సిండ్రోమ్‌’ లక్షణాలేనట. ఒంటరి తల్లులు, ఏకైక సంతానం ఉన్నవారు దీని బారిన పడుతున్నారట. అలాగని పిల్లలను భవిష్యత్తును నిర్మించుకోకుండా ఆపలేం కదా! ఈ ఆలోచనలతో నిండిపోతే మానసిక సమస్యలు ఎదురవుతాయి. దాన్నుంచి బయటపడటానికి... కొత్త వ్యాపకాలు, అలవాట్లను ఏర్పరచుకోమంటున్నారు నిపుణులు. వాటిలో పడి, ఈ బాధనుంచి బయటపడతారట. ఇంకా పిల్లలతో ఫోన్, వీడియో కాల్స్‌ మాట్లాడటం, వీలున్నప్పుడల్లా సర్‌ప్రైజ్‌లిస్తూ కలిసొచ్చినా మంచిదే. ఇంకా... చేయాలనుకుని పక్కన పడేసిన పనులపై దృష్టిపెట్టినా... ఈ ఖాళీ భావన దూరమవుతుంది. మిమ్మల్ని మీరు కొత్తగా పరిచయం చేసుకునే వీలుంటుంది. ఏమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్