వీరి గురించి ఎక్కువగా వెతికారు..!

ఏదైనా అంశం వార్తల్లో నిలిస్తే దాని గురించి వెంటనే గూగుల్‌ చేసి తెలుసుకుంటాం. ఆయా వ్యక్తుల గురించి వెతికేస్తాం. ఇలా ఎవరి గురించి ఎక్కువగా వెతికారు వంటి వివరాలను ఏటా గూగుల్‌ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది విడుదల చేసిన ఈ జాబితాలో మొదటి 10 మంది....

Published : 29 Dec 2022 21:39 IST

ఏదైనా అంశం వార్తల్లో నిలిస్తే దాని గురించి వెంటనే గూగుల్‌ చేసి తెలుసుకుంటాం. ఆయా వ్యక్తుల గురించి వెతికేస్తాం. ఇలా ఎవరి గురించి ఎక్కువగా వెతికారు వంటి వివరాలను ఏటా గూగుల్‌ విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది విడుదల చేసిన ఈ జాబితాలో మొదటి 10 మంది భారతీయుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు.

ద్రౌపది ముర్ము

ఈ ఏడాది ఎక్కువమంది శోధించిన వ్యక్తుల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో స్థానంలో నిలిచారు. ఆమె ఈ ఏడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించి.. రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి ఆదివాసిగా, రెండో మహిళగా గుర్తింపు పొందారు. అలాగే స్వతంత్ర భారతదేశంలో జన్మించిన మొదటి రాష్ట్రపతిగా కూడా గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది పేరును భాజపా నామినేట్‌ చేసిన దగ్గర్నుంచి ఆమె వయసు, ప్రాంతం, చదువు వంటి వివరాలను తెలుసుకోవడానికి చాలామంది గూగుల్‌లో సెర్చ్‌ చేశారు.

సుస్మితాసేన్

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన వ్యక్తుల్లో బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్‌ కూడా ఉన్నారు. ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్ లలిత్‌ మోదీతో డేటింగ్‌ వార్తలు, ‘ఆర్య’ వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి అడుగుపెట్టడంతో సుస్మితాసేన్‌ గురించి చాలామంది గూగుల్‌లో శోధించారు. ఆ తర్వాత Taali వెబ్‌సిరీస్‌లో ట్రాన్స్‌జెండర్‌ పాత్ర పోషిస్తోందన్న వార్తలతో ఈ ఏడాదంతా ఆమె గురించి శోధించారు.

నుపుర్‌ శర్మ

ఈ ఏడాది మనదేశంలో అత్యధికమంది శోధించిన వ్యక్తుల్లో భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మ మొదటి స్థానంలో నిలిచారు. ఓ ఛానల్‌లో చర్చ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆమెకు పలు బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయి. దాంతో భాజపా ఆమెను సస్పెండ్‌ చేసింది. భారత సర్వోన్నత న్యాయస్థానం కూడా ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టింది. తర్వాత తన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణలు కూడా చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్