ప్రొఫెషనల్ డిగ్రీ విద్యార్థినులకు.. కోటక్‌ కన్య స్కాలర్‌షిప్!

ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు తమదైన ప్రతిభ కనబరిచి టెన్త్‌, ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. కానీ, వారిలో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. దీనికి ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే అమ్మాయిలు ఆర్థిక పరిస్థితులు....

Updated : 25 Mar 2023 17:05 IST

ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు తమదైన ప్రతిభ కనబరిచి టెన్త్‌, ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. కానీ, వారిలో ఉన్నత చదువులు చదివే వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. దీనికి ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమవుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చదివే అమ్మాయిలు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఉన్నత చదువులు చదవలేకపోతున్నారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి వారికి తమ వంతు సహాయం అందించాలనుకుంది కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభగల అమ్మాయిలకు ఈ సంస్థ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఇటీవలే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఆర్థికంగా వెనుకబడిన యువత, విద్యార్థులకు చదువు, ఉపాధి అవకాశాలను కల్పించడానికి కోటక్‌ మహీంద్రా గ్రూప్ 2007లో కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ను నెలకొల్పింది. ఈ ఫౌండేషన్‌ దాదాపు 140కి పైగా పాఠశాలలు, 1500 మంది టీచర్లు, లక్ష మంది విద్యార్థులతో కలిసి పనిచేస్తోంది. అంతేకాకుండా యవతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో ఇంటర్‌ పూర్తై ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశం పొందిన అమ్మాయిలకు ఆర్థిక సహాయం అందించడానికి ‘కోటక్‌ కన్య స్కాలర్‌షిప్‌’ పేరుతో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 30 చివరి తేదీ. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు..

అర్హతలు:

⚛ డిజైన్‌, ఆర్కిటెక్చర్‌, ఎంబీబీఎస్‌, ఇంజినీరింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ.. వంటి ప్రొఫెషనల్‌ డిగ్రీ కోర్సుల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్‌ పొందిన వారు అర్హులు.(ఆ కాలేజీలు NAAC / NIRF గుర్తింపు/ర్యాంకింగ్ పొంది ఉండాలి).

⚛ 12వ తరగతి లేదా ఇంటర్‌లో 85 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

⚛ అన్ని వనరుల ఆదాయం కలుపుకొని సంవత్సరానికి కుటుంబ ఆదాయం 3.20 లక్షల కంటే తక్కువగా ఉండాలి.

⚛ కోటక్‌ మహీంద్రా గ్రూప్‌, కోటక్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, బడ్డీ4స్టడీకి సంబంధించిన ఉద్యోగుల పిల్లలు ఇందుకు అనర్హులు.

⚛ పాన్‌ ఇండియా వ్యాప్తంగా ఉన్న విద్యార్థినులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు:

ఎంపికైన అమ్మాయిలు కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల వరకు పొందే అవకాశం ఉంటుంది.

ఈ స్కాలర్‌షిప్‌కు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ కింది లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.

https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship?ref=featuredBlocks

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్