Ashwini Asokan: అన్నీ వదులుకొని దేశానికొచ్చా!

శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ‘గెలవక్కర్లేదు కానీ.. పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేయకపోతే చాలు’ అనుకున్నా. అమెరికా ఉద్యోగం, పదేళ్ల అనుభవం, మంచి జీతం, ఉన్నత హోదా వదులుకొని..

Published : 10 Mar 2023 00:01 IST

శాన్‌ఫ్రాన్సిస్కో ఎయిర్‌పోర్ట్‌లో కూర్చొని ‘గెలవక్కర్లేదు కానీ.. పరిస్థితిని గందరగోళంలోకి నెట్టేయకపోతే చాలు’ అనుకున్నా. అమెరికా ఉద్యోగం, పదేళ్ల అనుభవం, మంచి జీతం, ఉన్నత హోదా వదులుకొని.. 20 రోజుల ఆలోచనను నమ్మి స్టార్టప్‌ పెట్టడానికి దేశానికి తిరుగు ప్రయాణమయ్యా మరి! నావెంటే మావారు. కాస్త కంగారు సహజమే! అయినా ముందడుగేశానంటే నేను నమ్మిన సూత్రాలే కారణం. అవేంటంటే..

* తక్కువ మంది నడిచిన బాటలో వెళ్లడానికి భయపడతాం. కానీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదే సరైన మార్గం. మనం దాటొచ్చిన ఎత్తుపల్లాలు మనల్నే ఆశ్చర్యపరుస్తాయి.

* నిలకడగా సాగడాన్ని నమ్మొద్దు. అదో అలవాటంతే! సవాళ్లనే ఎంచుకోండి. ప్రతి రెండేళ్లకి కొత్త పనివ్వమని మా బాస్‌ని అడుగుతుండేదాన్ని. దానివల్లే ఎన్నో విషయాలు నేర్చుకున్నా. స్టార్టప్‌ ధైర్యంగా మొదలుపెట్టానంటే ఆ తీరే కారణం.

* పని చిన్నదైనా పెద్దదైనా.. ‘హమ్మయ్య.. పూర్తిచేశా’ అన్న ధోరణి వద్దు. ‘నా ముద్ర ఉందా’ అని పరితపించండి. ఎవరితోనో కాదు.. మీతో మీరే పోటీ పెట్టుకోండి. అనవసర ఒత్తిడి ఉండదు. పైగా అది సానుకూలంగా ముందుకు నడిపే ప్రేరణ కూడా!


గూగుల్‌, ఫేస్‌బుక్‌, ట్విటర్‌ల్లో అవకాశాలు కాదనుకొని ఇంటెల్‌లో చేరినప్పుడు, విదేశీ కంపెనీ మీటింగ్‌కి వెళతానని ముందుకొచ్చినప్పుడు, ఉద్యోగం మానేసినప్పుడు.. ఇంకా ఎన్ని సందర్భాల్లోనో.. ‘నువ్వు అమ్మాయివి, నీది పిచ్చి ఆలోచన, ఇల్లు నీ మొదటి ప్రాధాన్యమవ్వాలి’ వంటి సలహాలెన్నో వచ్చేవి. అయినా... నేను నమ్మిన దారిలోనే వెళ్లా. మీరూ ఈ సూత్రాలను ప్రయత్నించండి. మీలోని కొత్తవ్యక్తి మీకు పరిచయమవుతారు.

- అశ్విని అశోకన్‌, సహ వ్యవస్థాపకురాలు, మ్యాడ్‌ స్ట్రీట్‌ డెన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్