ప్రీతి, ప్రియాంకల హోలీ సంబరాలు చూశారా?

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు సందడిగా జరుపుకొనే పండగ హోలీ. ఇందుకు సినిమా తారలూ మినహాయింపు కాదు. అమెరికాలో ఉంటున్నా ప్రతి పండగనూ ఎంజాయ్‌ చేయడంలో ముందుండే....

Updated : 09 Mar 2023 16:40 IST

(Photos: Instagram)

‘కొట్టు కొట్టు కొట్టు.. రంగు తీసి కొట్టు..’ అంటూ చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు సందడిగా జరుపుకొనే పండగ హోలీ. ఇందుకు సినిమా తారలూ మినహాయింపు కాదు. అమెరికాలో ఉంటున్నా ప్రతి పండగనూ ఎంజాయ్‌ చేయడంలో ముందుండే ప్రియాంక, నిక్‌ జోనాస్‌ దంపతులు హోలీని కూడా ఘనంగా జరుపుకొన్నారు. వీరికి మరో బాలీవుడ్‌ తార ప్రీతీ జింతా తోడయ్యారు. ఆమె తన భర్తతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను ఈ తారలు తమ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్‌గా మారాయి.

నిక్‌ జోనాస్ తన పైన రంగులు చల్లుతున్నట్టుగా ఉన్న ఫొటోను ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌గా పెట్టుకుంది. దీనికి ‘హోలీ జరుపుకొనే వారందరికీ శుభాకాంక్షలు..’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీనిని నిక్‌ కూడా తన స్టేటస్‌గా పెట్టుకున్నారు.

వీరితో కలిసి హోలీ వేడుకలు జరుపుకొన్న మరో బాలీవుడ్ తార ప్రీతీ జింతా వీటికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీనికి ‘అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈ రోజు చాలా ఎంజాయ్‌ చేశాం. ఈ వేడుకను హోస్ట్‌ చేసినందుకు ప్రియాంక, నిక్‌ జోనాస్‌కు కృతజ్ఞతలు. మీతో హోలీ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వర్షం రాకుండా ఉండడం, ఎండ ఎక్కువ లేకపోవడం కలిసివచ్చింది. డ్యాన్స్, రుచికరమైన భోజనం తర్వాత ఈ రాత్రి చిన్నపిల్లలా ప్రశాంతంగా నిద్రపోతా’ అని రాసుకొచ్చింది.

ఇక సినిమా విషయాలకు వస్తే ప్రియాంక నటించిన ‘లవ్‌ ఎగెయిన్‌’ చిత్రం, సిటాడెల్‌ అనే వెబ్‌సిరీస్‌ త్వరలో విడుదల కానున్నాయి. ఇక ఫర్హాన్  అఖ్తర్ దర్శకత్వం వహించిన ‘జీ లే జరా’ అనే చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో అలియా భట్‌, కత్రినా కైఫ్‌లు కూడా ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్