ఈ శక్తులు మనకే సొంతం..!

స్త్రీపురుషులు సమానమే..! కానీ స్త్రీలు కొంచెం ఎక్కువ..! 'అదేంటీ.. జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..?' అని అనుకోకండి.. నిజానికి సృష్టిలో స్త్రీపురుషులు ఎవరికి వారే ప్రత్యేకం. కానీ స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. సహనం, మానసిక పరిణతి, ఒక విషయాన్ని....

Published : 07 Mar 2023 20:47 IST

స్త్రీపురుషులు సమానమే..! కానీ స్త్రీలు కొంచెం ఎక్కువ..! 'అదేంటీ.. జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..?' అని అనుకోకండి.. నిజానికి సృష్టిలో స్త్రీపురుషులు ఎవరికి వారే ప్రత్యేకం. కానీ స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. సహనం, మానసిక పరిణతి, ఒక విషయాన్ని ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించగలగడం..  ఇవే కాదు.. నిజానికి స్త్రీ సహజంగానే ఎన్నో అపూర్వ శక్తులు కలిగిన పవర్ హౌస్!

ఒత్తిడిని జయించడంలో..

సమాజంలో ఉండే కొన్ని అపోహల వల్ల పురుషులు తమ సమస్యను ఎవరితోనూ పంచుకోకుండా లోలోపలే కుమిలి పోతారు. వారి ఒత్తిడిని కోపం రూపంలో దగ్గరి వారిపై చూపిస్తారు. దానివల్ల సమస్య మరింత జటిలమై తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కానీ ఒత్తిడిలో ఉన్నప్పుడు స్త్రీలు తమ సమస్యను అధిగమించడానికి ఇతరులను సంప్రదిస్తారు. ఈ క్రమంలో- మానసిక ఒత్తిడిని జయించడంలో పురుషుల కన్నా మహిళలే ముందుంటారంటున్నారు పరిశోధకులు.

ప్రమాదాలు పసిగట్టగలం..

స్త్రీలలో ఉత్పత్తయ్యే కొన్ని హార్మోన్ల ప్రభావం వల్ల వారు ప్రమాదకరమైన వాతావరణాన్ని ముందే పసిగట్టగలరని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే స్వతహాగా రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందట.

రంగుల సంగతి మనకే బాగా తెలుసు..!

వివిధ రంగులను గుర్తించడంలో కూడా పురుషుల కన్నా మహిళలే ముందుంటారట. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న కాలం నుంచీ మహిళల్లో ఈ ప్రత్యేకమైన శక్తి ఏర్పడిందని పరిశోధకుల అభిప్రాయం. తినడానికి పనికివచ్చే ఆకులను, పండ్లను వాటి రంగుని బట్టి గుర్తించడంలో అప్పటినుంచే స్త్రీలు సిద్ధహస్తులట..!

ప్రపంచాన్ని చక్కదిద్దుతూ..

మహిళలందరూ ఒక స్థాయిలో తమ ప్రపంచాన్ని కాపాడుకునేందుకు రేయింబవళ్లూ కష్టపడేవారే. ఇంట్లో వాళ్లందరికీ సరైన సమయానికి అవసరమైనవన్నీ అందిస్తూ వారికి అన్నివేళలా తోడ్పాటునందించడం కేవలం మహిళల వల్లే సాధ్యం. తమ ఇల్లనే ప్రపంచం బాధ్యతను ప్రతి మహిళా తన భుజాలపై మోస్తుంది. కొన్నిసార్లు అవసరమైతే దానికోసం త్యాగాలు కూడా చేస్తుంది. ఉదయాన్నే లేచిన దగ్గర్నుంచి ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు తెలుసుకుంటూ సూపర్ హ్యూమన్‌లా పని చేయడంలోనే ఆమె రోజంతా గడిచిపోతుంది. అయినా తన చుట్టూ ఉన్నవారికి ఆనందాన్ని అందిస్తే చాలు.. ఆమె కళ్లలో సంతోషం కనిపిస్తుంది.

ప్రేమమూర్తులు..!

మహిళలంటేనే ప్రేమమూర్తులు. ప్రేమ విలువ తెలిసిన వ్యక్తులు. ఆర్థిక సంబంధాల కంటే మానవ సంబంధాలకే స్త్రీలు ఎక్కువగా విలువనిస్తుంటారు. పదిమందికీ లాభం చేకూరే పనిని చేపట్టేందుకు స్త్రీలు ముందుంటారు. స్త్రీ అంటేనే అమ్మతనం. అమ్మ కంటే ఎక్కువ ప్రేమ విలువ తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరుంటారు చెప్పండి? అందుకే ప్రేమనంతా ఏర్చికూర్చి ఒక్కచోట చేర్చిన వ్యక్తులుగా స్త్రీమూర్తులను చెప్పుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్