పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా?

కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు పిల్లలు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

Published : 04 May 2024 21:00 IST

కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటప్పుడు పిల్లలు కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు.

అందులో పోస్ట్‌ చేయద్దు..

కొంతమంది తాము చేసే ప్రతి పనిని ఇతరులకు తెలియజేయాలనే ఆత్రుతతో సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతుంటారు. ఒక్కోసారి ఇవే ప్రమాదకరంగా మారుతుంటాయి. ఇదే విషయాన్ని మీ పిల్లలకు తెలియజేయండి. మీరు మీ పిల్లలను ఇంట్లో వదిలి వెళ్లినప్పుడు వారు ఒంటరిగా ఉన్నారని తెలియజేసే విధంగా ఎలాంటి పోస్టులు పెట్టద్దని చెప్పండి. ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల కలిగే ప్రమాదాన్ని ఉదాహరణ రూపంలో వివరించండి.

వారొస్తే డోర్‌ తీయద్దు...

సాధారణంగా పిల్లలను అపరిచితులకు దూరంగా ఉంచుతుంటాం. అలాగే వారు ఏది ఇచ్చినా తీసుకోవద్దని చెబుతుంటాం. ఇదే పద్ధతిని మీరు ఇంట్లో లేని సమయంలోనూ పాటించమని చెప్పాలి. అలాంటి వారెవరైనా వస్తే డోర్‌ తీయద్దని చెప్పాలి. దీనికోసం మీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ కెమెరాలను పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎవరు డోర్‌ బెల్‌ కొట్టారో వారు సులభంగా తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎక్కడున్నా సరే- మధ్యమధ్యలో ఈ కెమెరాల ద్వారా వాళ్లు ఎలా ఉన్నారో చెక్ చేయడం మర్చిపోవద్దు.

ఆ ప్రయోగాలు వద్దు...

కొంతమంది పిల్లలు అమ్మా నాన్న లేరు కదా! అని కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. వంట చేయడం ఇందులో భాగమే. ఇది అస్సలు మంచిది కాదు. మీరు బయటకు వెళ్లినప్పుడు గ్యాస్‌ స్టవ్‌ ఆఫ్‌ చేసి వెళ్లండి. అలాగే పిల్లలను ఇలాంటి మంట వచ్చే వస్తువులకు దూరంగా ఉండమని చెప్పండి. దానివల్ల వచ్చే అనర్థాలను వారికి వివరించండి.

అత్యవసర నంబర్లు చెప్పండి..

అత్యవసర పరిస్థితుల్లో ఎవరికి ఫోన్ చేయాలో ముందుగానే చెప్పండి. వాటిని ఎమర్జెన్సీ నంబర్లుగా వారి ఫోన్లో సేవ్ చేయండి.  మీ సన్నిహితులు, ఇంటి పక్కన ఉన్నవారి నంబర్లను కూడా వారికి చెప్పండి.

ఇవి కూడా...

⚛ ఎమర్జెన్సీ లైట్లకు ఎప్పుడూ ఛార్జింగ్‌ ఉండేలా చూసుకోవాలి. దానిని ఎలా ఉపయోగించాలో పిల్లలకు చెప్పండి. ఎప్పుడైనా కరెంట్‌ లేనప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది.

⚛ కొంచెం పెద్దవారైతే ఇంటర్నెట్‌ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి ఇంటర్నెట్ వాడకానికి సంబంధించిన జాగ్రత్తలను వివరించండి. ఫోన్‌లో లొకేషన్‌ని ఆఫ్‌ చేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలను పంచుకోకుండా ఉండడం.. వంటివి ఇందులో భాగమే.

⚛ పిల్లలు ఆడుకుంటూ దెబ్బలు తగిలించుకోవడం సహజంగా జరుగుతుంటుంది. ఒకవేళ మీరు లేనప్పుడు ఇలా జరిగితే వారే సొంతంగా ఫస్ట్‌ ఎయిడ్‌ చేసుకునేలా శిక్షణ ఇవ్వండి. ఇది చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది.

⚛ ఇంట్లో ఉండే మందులను వారికి దూరంగా ఉంచండి.

ఈ జాగ్రత్తలన్నిటినీ వారు ఎలా ఆచరిస్తారో ఒకసారి స్వయంగా పరీక్షించి చూడడం అవసరం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్