Relationship: సత్సంబంధాలే కీలకం..

దంపతులిద్దరూ ఉదయం ఆఫీసుకెళ్తే మళ్లీ రాత్రికెప్పుడో తిరిగొస్తారు. వచ్చిన దగ్గరి నుంచి కుటుంబ సభ్యుల అవసరాలు, వంటా వార్పు, పిల్లలూ వాళ్ల అల్లరి ఇవే సరిపోతాయి. ఇక భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడుంటుంది చెప్పండి.

Updated : 05 May 2023 04:08 IST

దంపతులిద్దరూ ఉదయం ఆఫీసుకెళ్తే మళ్లీ రాత్రికెప్పుడో తిరిగొస్తారు. వచ్చిన దగ్గరి నుంచి కుటుంబ సభ్యుల అవసరాలు, వంటా వార్పు, పిల్లలూ వాళ్ల అల్లరి ఇవే సరిపోతాయి. ఇక భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకోవడానికి సమయం ఎక్కడుంటుంది చెప్పండి. కమ్యూనికేషన్‌ లేకపోవటమే విడాకులకు ప్రధాన కారణమంటున్నారు నిపుణులు..

* ఆఫీసు పనిలో ఎంత బిజీగా ఉన్నా మధ్యలో ఓ అయిదు నిమిషాలు భాగస్వామి కోసం కేటాయించాల్సిందే. తిన్నావా అనో, ఓ సరదా సందేశాన్నో, ప్రేమను పెంచే ఒక వీడియోని గానీ పంచుకుంటే రోజంతా మీరు దూరంగా ఉన్నట్లు అనిపించదు.

* ఏ కారణంతో అయినా మీ భాగస్వామి బాగా ,ఆవేశంలో ఉంటే వారికి ఇంకా చిరాకు కలిగించే పనులు చేయకూడదు. చేతిలో చెయ్యివేసి ఊరడించడం, దగ్గరికి తీసుకుని శాంత పరచడం, వారెందుకు అలా ఉన్నారో అని అర్థం చేసుకొంటే సరి.

* ఒకరిని మించి ఒకరు మొండి పట్టుదలతో కూర్చోవటం వల్ల సమస్య పరిష్కారం అవదు. తనే ముందు మాట్లాడతారని ఎదురు చూస్తూ ఉండకూడదు. అవతలి వ్యక్తికంటే ముందే మనం మాట్లాడితే మనపై గౌరవం ఇంకా పెరుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్