Happy tips: తక్కువతో ఎక్కువ ఆనందం...

మనలో చాలామందికి చూసిందల్లా కొనేయటం అలవాటు. అమ్మాయిలంటేనే నగలు, చీరలు, మేకప్‌ సామాన్లు ఇలా ప్రతీది కొనాలనిపిస్తుంది. డబ్బు పొదుపు చేయటం అంటే సంపాదించినట్టే అంటారు కదా! అందుకే ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి.

Published : 27 May 2023 00:03 IST

మనలో చాలామందికి చూసిందల్లా కొనేయటం అలవాటు. అమ్మాయిలంటేనే నగలు, చీరలు, మేకప్‌ సామాన్లు ఇలా ప్రతీది కొనాలనిపిస్తుంది. డబ్బు పొదుపు చేయటం అంటే సంపాదించినట్టే అంటారు కదా! అందుకే ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి.

మంచి అనుభవాలతో.. వస్తువులు పోగుచేసుకోవటం కన్నా జ్ఞాపకాలు, అనుభవాలను పోగుచేసుకోవటం ఉత్తమం. కంటికి కనిపించినవన్నీ కొనేస్తుంటే డబ్బు వృథాతోపాటు చెత్తలా పేరుకుపోతాయి. కొన్ని వస్తువులు తాత్కాలికంగా ఆనందం ఇవ్వొచ్చు. కానీ దీర్ఘకాలంలో ఉపయోగం లేదు.

తక్కువతో.. మనకు నిజంగా ఏది అవసరం, ఏది కాదు అనే పూర్తి అవగాహన ఉన్నప్పుడే జీవితంలో విజయవంతమవుతామట. చెప్పులు, దుస్తులు ఇలా ఏ వస్తువైనా సరే అవసరం ఉన్న మేర, అన్ని కాలాలకు నప్పేవి కొనుక్కుంటే ఉపయోగం ఉంటుంది.

పనికిరానివి తీసేసి.. ముందుగా మనకు అవసరం లేవనుకున్న వాటిని తొలగించండి. ఇల్లు ఎంత శుభ్రంగా, ఎంత తక్కువ సామానుతో ఉంటే అంత అందం. మనకు అవసరం లేని వాటిని అవసరమైన వాళ్లకు ఇవ్వాలి. ఎక్కడ ఖర్చు పెడతున్నామనే అంచనా మనకు పూర్తిగా ఉండాలి. పెట్టుబడులపై దృష్టి పెట్టాలి.

విలువ తెలుసుకుని.. ఏ వస్తువు కొన్నా దాంతో బహుళ ప్రయోజనాలుండేలా చూసుకోండి. ఉదాహరణకు లిప్‌ టింట్‌ ఉందనుకోండి.. దాన్ని చీక్స్‌పై బ్లష్‌ చేసుకోడానికి ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా కళ్ల మీద ఐషాడో గానూ వాడుకోవచ్చు. అలా ఏ వస్తువు కొన్నా ఆలోచించి కొంటే ఉత్తమం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్