అమ్మాయిలూ.. ఇవి పాటిస్తున్నారా?

చదువు, ఇతర వ్యక్తిగత పనుల హడావిడిలో పడిపోయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇటు శారీరకంగా, అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది.

Published : 13 Apr 2024 21:23 IST

చదువు, ఇతర వ్యక్తిగత పనుల హడావిడిలో పడిపోయి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టకపోతే ఇటు శారీరకంగా, అటు మానసికంగా వివిధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. పైగా ఈ వేసవిలో వీటి ప్రభావం ఇంకాస్త ఎక్కువ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే- వేసవిలోనూ ఆరోగ్యంగా, ఉత్సాహంగా గడిపేయచ్చు. మరి అవేంటో చూద్దాం రండి...

ఆ నొప్పికి దూరంగా..

నెలసరి సమయంలో చాలామంది కడుపునొప్పి, నడుంనొప్పి, ఒత్తిడి, చికాకు.. ఇలా పలు రకాల సమస్యలతో సతమతమవుతుంటారు. అలాగని నీరస పడిపోకుండా నడవడం, పరిగెత్తడం, ఆటలాడడం.. వంటి వాటికీ ప్రాధాన్యమివ్వాలి. తద్వారా ఈ నొప్పుల నుంచి కాస్త ఉపశమనం పొందచ్చు.. ఉత్సాహంగానూ గడిపేయచ్చు. అలాగే ఎముకలు, వెన్నెముక, కండరాలు.. దృఢంగా మారడానికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి.

మచ్చలేని చర్మానికి..

వేసవి వచ్చిందంటే చాలామంది చల్లటి పానీయాల్ని ఆశ్రయిస్తుంటారు. ఇందులోనూ ముఖ్యంగా బయటికి వెళ్లినప్పుడైతే ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు. కానీ ఇవి శరీరానికి అస్సలు మంచివి కావు. కాబట్టి ఇంట్లో తయారుచేసుకొనే మజ్జిగ, పండ్ల రసాలు తాగడం ఇటు ఆరోగ్యానికి, అటు చర్మ ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

వీటితో పాటు.. కోకమ్ షర్బత్ (కోకమ్ పండుతో చేసేది), ఆమ్ పన్నా (మామిడి కాయతో తయారుచేసేది), బెల్ షర్బత్ (మారేడు పండుతో చేసేది).. వంటివి ఎక్కువగా తాగాలి. ఇవన్నీ శరీరంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు సహాయపడతాయి. అలాగే చక్కటి పోషణనందించి మచ్చలేని చర్మాన్ని సొంతం చేస్తాయి.

లేటుగా వద్దు..

చక్కటి ఆరోగ్యాన్ని, సౌందర్యాన్ని సొంతం చేసుకోవాలంటే తగినంత నిద్ర కూడా ఎంతో అవసరం. కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా కంటి నిండా నిద్రపోవాలి. ఈ క్రమంలో- ఎప్పుడూ లేట్ నైట్ పార్టీలంటూ నిద్రను త్యాగం చేయకుండా రోజూ రాత్రి పూట వీలైనంత త్వరగా పడుకోవాలి. దీనివల్ల హార్మోన్ల స్థాయులు అదుపులో ఉంటాయి. అలాగే మెదడు పనితీరు మరింతగా మెరుగుపడుతుంది.. రోజూ కనీసం ఎనిమిది గంటలు నిద్రకు కేటాయించడం వల్ల ఒత్తిళ్లు, ఆందోళనలకు దూరంగా ఉండచ్చు. తద్వారా ఇటు శారీరకంగా, అటు మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండచ్చు. బరువునూ అదుపులో ఉంచుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్