అమ్మాయిలకు వ్యాపారమా!

ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా ఉద్యోగంలో కుదురుకోవాలనుకునే అమ్మాయిల కంటే...సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరిగింది.

Published : 30 Dec 2022 00:36 IST

ఈ మధ్య కాలంలో సంప్రదాయంగా ఉద్యోగంలో కుదురుకోవాలనుకునే అమ్మాయిల కంటే...సొంతంగా వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య పెరిగింది. ఇందుకు చేయాలన్న పట్టుదల, పెట్టుబడులతో పాటూ అదనంగా మరికొన్ని నైపుణ్యాలూ కావాలని చెబుతారు నిపుణులు.

* అసలు వ్యాపారం ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు అన్న స్పష్టత లేకుండా ముందుకు వెళ్లలేరు. ఈ విషయంలో కచ్చితంగా కొంత పరిజ్ఞానం అవసరం. ఇందులో అవగాహన కావాలనుకుంటే బిజినెస్‌ కన్సల్టెంట్ల సాయం తీసుకోవచ్చు.

* పెట్టుబడి, ప్రణాళిక, పట్టుదలతో పాటూ...తగినంత సమయం కేటాయించగలగాలి. ముందుగానే మహిళలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తగ్గట్లుగా టైం మేనేజ్‌మెంట్‌ అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా పెళ్లయినవారు...ఇంటినీ, పిల్లల్నీ, ఇతర బాధ్యతల్నీ సమన్వయం చేసుకునేలా ముందే మానసికంగా సిద్ధం అవ్వాలి.

* ఇతరులపై ఆధారపడి... వ్యాపారం చేయాలనుకోవద్దు. ఇది ఏ సమయంలో అయినా బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. అందుకే మహిళలనే భయాల్ని వదిలేసి... అన్ని విషయాల్లోనూ పట్టు తెచ్చుకోవడం మంచిది. మార్కెటింగ్‌ గురించి తెలుసుకునేందుకు విస్తృతంగా వ్యక్తులతో మాట్లాడాలి. అంతర్జాలంపై పట్టు తెచ్చుకోవాలి. ఇవన్నీ మీకో చక్కటి మార్గాన్ని చూపిస్తాయి.

* వ్యాపారమైనా, జీవితమైనా .... అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటే పొరపాటు. కష్టనష్టాలనూ, లాభనష్టాల్నీ బేరీజు వేసుకుంటూ లోపాలు సరిదిద్దుకుంటూ పునాదిని బలపరుచుకోవాలి. ఎప్పటికప్పుడు మార్కెట్‌ పోకడల్నీ, వ్యాపారాన్ని ప్రభావితం చేసే వివిధ అంశాలనూ తెలుసుకోగలిగితేనే మీరూ విజయం సాధించగలరు.

* కేవలం ఉద్యోగులకే కాదు వ్యాపారం చేయాలనుకున్నవారూ నెట్‌వర్క్‌ని విస్తరించుకోగలగాలి. ఓ మెంటార్‌ని పెట్టుకుని సలహాలు తీసుకోవడం, వ్యాపారం గురించి పది మందికి తెలియజేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం... వంటివన్నీ నయా మార్కెటింగ్‌ సూత్రాలు. వీటినీ ఒంటపట్టించుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్