Childern: అభిరుచికి అడ్డుకట్ట వేయొద్దు...

పిల్లల్లో పుస్తకపఠనాన్ని అభిరుచిగా మార్చాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే. ఈ విషయంలో అమ్మానాన్నలు చేసే పొరపాట్లు.. పిల్లలను పుస్తకాలకు దూరం చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

Published : 07 May 2023 00:21 IST

పిల్లల్లో పుస్తకపఠనాన్ని అభిరుచిగా మార్చాల్సిన బాధ్యత పెద్దవాళ్లదే. ఈ విషయంలో అమ్మానాన్నలు చేసే పొరపాట్లు.. పిల్లలను పుస్తకాలకు దూరం చేసే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

కథలు ఊసుపోవడానికే కాదు.. ఎన్నో నైపుణ్యాలను నేర్చుకోవడానికీ సాయపడతాయి. కాబట్టి.. ముందు అక్షరాల నుంచి పదాలను పరిచయం చేయండి. ఆపై బొమ్మలతో కూడిన కథల పుస్తకాలను కానుకగా ఇచ్చి కథాపాత్రలపై ఆసక్తి కలిగేలా చేయాలి. చదివేటప్పుడు పక్కనే ఉండాలి. అవసరమైతే చదివి వినిపిస్తూ మధ్యలో వారికి చదవడానికి అవకాశమిచ్చినట్లుగా ఉత్సాహపరచాలి. అప్పుడే తెలియని, ఉచ్చరించలేని పదాలను అమ్మానాన్నలను అడగడానికి సంకోచించరు.

మొక్కుబడిగా.. రోజుకొక పుస్తకం చదవాల్సిందే అనే నియమం పిల్లలపై రుద్దకూడదు. వారికి ఆసక్తి లేకపోతే దాన్నీ మొక్కుబడిగా చేస్తారు. కథ అంటే చిన్నారులకు ప్రేమ కలిగేలా చేయడం పెద్దవాళ్ల బాధ్యత. సహజసిద్ధంగా జరుగుతున్న ఒక సంఘటనలా కథను చెప్పడం ముందుగా పెద్దవాళ్లు నేర్చుకోవాలి. ఆ తర్వాత పిల్లలెదుట ప్రదర్శించాలి. అలాగే గ్రంథాలయం లేదా పుస్తకాల దుకాణానికి తీసుకెళ్లి మీరే ‘ఫలానాది చదువు’ ఎంచి వాళ్ల చేతిలో పెట్టొద్దు. ఏది చదవాలో నిర్ణయించుకునే అవకాశాన్ని చిన్నారులకే ఇవ్వాలి. అలాగే గబగబా చదవమంటూ కంగారు పెట్టకూడదు. దాన్నొక సవాలుగా కాకుండా కథ నుంచి పిల్లలు అనుభూతి పొందేలా చేయాలి. అర్థం కాకపోతే పదాలు, వాక్యాలను వివరించండి పర్లేదు. అంతేకానీ కథంతా చెప్పేయొద్దు. చదవడంపై ఆసక్తి పోతుంది. ఇవన్నీ నేర్చుకునే క్రమంలో భాగాలు. సరదాగా అనిపించడమే కాదు.. పుస్తక పఠనాన్ని ప్రేమించడమూ మొదలుపెడతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్