ఆఫీసు పని.. వేగంగా!

కొందరు ఆఫీసు పనిని ఎంతో తేలిగ్గా చేసేస్తారు. మరికొందరు దాన్నో బరువుగా భావిస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు.

Published : 26 Jan 2023 00:35 IST

కొందరు ఆఫీసు పనిని ఎంతో తేలిగ్గా చేసేస్తారు. మరికొందరు దాన్నో బరువుగా భావిస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. మీరు కూడా ఆఫీసు పనిని చకచకా పూర్తిచేయాలనుకుంటున్నారా? అయితే ఈ మార్పులని ఆహ్వానించండి..

* ఎక్కువ గంటలు పనిచేయాలనే లెక్కల కంటే... చేసే పనిని ఎంత స్మార్ట్‌గా, నాణ్యంగా పూర్తిచేస్తామన్నదే ముఖ్యం. ఏది ముఖ్యమో నిర్ధరించుకుని.. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయండి. నిర్విరామంగా పనిచేసినా.. పనిలో నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. రెండు గంటలకోసారైనా చిన్నపాటి విరామాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి దరి చేరదు.

* తినీ తినక.. హడావుడిగా ఆఫీసుకెళ్లిన కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. ఇలాంటప్పుడు ఖాళీ కడుపుతో ఉండిపోయినా, జంక్‌ఫుడ్‌ తినడం మొదలుపెట్టినా జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. అందుకే కాసిని నట్స్‌, ఎండు ద్రాక్ష, ఖర్జూరం వంటివి దగ్గర ఉంచుకోండి. ఇవి మీకు తక్షణశక్తిని ఇవ్వడంతో పాటూ ఆకలినీ తగ్గిస్తాయి.

* డెస్క్‌టాప్‌ మీద అయినా, డెస్క్‌ మీద అయినా.. అవసరం లేని ఫోల్డర్లూ, కాగితాలూ, ఫైల్స్‌ వంటివన్నీ ఎప్పటికప్పుడు తీసేయండి. ఇంటిని అందంగా చక్కదిద్దుకున్నట్లే డెస్క్‌నీ అందంగా సర్దేయండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఓ చిన్న మొక్కను మీ టేబుల్‌పై పెట్టండి. ఆహ్లాదంగా అనిపిస్తుంది.

* ఆఫీసుకు వెళ్లింది మొదలు.. గంటలతరబడి కూర్చుని పనిచేస్తుంటాం. దానివల్ల బరువు పెరగడం ఒక్కటే కాదు, శక్తి కూడా తగ్గుతుంది. దాంతో కాసేపు కూర్చోగానే త్వరగా అలసిపోతుంటాం. ఏ కొద్ది సమయం చిక్కినా నాలుగు అడుగులు వేయడానికి ప్రయత్నించండి. వాడే కంప్యూటర్‌ ఎత్తు, మనం కూర్చునే విధానం అన్నీ సరి చూసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చూపు తగ్గడం, నడుం నొప్పి, కాళ్లవాపులు వంటివి ఎదురుకావొచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్