Success tips: లక్ష్యం దిశగా సాగాలంటే...

కోర్సు, కొలువు.. ఏ ఎంపికైనా సాధారణంగా అమ్మాయిలు ఇతరులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలా కాక మీ లక్ష్యమేంటో గమనించుకోండి. దాన్ని సాధించే ప్రణాళిక వేసుకోండి అంటున్నారు నిపుణులు.

Published : 17 Apr 2023 00:24 IST

కోర్సు, కొలువు.. ఏ ఎంపికైనా సాధారణంగా అమ్మాయిలు ఇతరులపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. అలా కాక మీ లక్ష్యమేంటో గమనించుకోండి. దాన్ని సాధించే ప్రణాళిక వేసుకోండి అంటున్నారు నిపుణులు. దానికి సాయపడే సలహాలూ ఇస్తున్నారిలా.

ఎంపిక.. ఎంచుకున్న లక్ష్యం భవిష్యత్తులో మనకు ఉపయోగపడేదై ఉండాలి. ప్రత్యేకత కోసం తపించడం మంచిదే అయినా.. అసాధ్యం అనిపించేదాన్ని ఎంచుకోవద్దు. ఉదాహరణకు వచ్చే ఐదేళ్లలో మనం చందమామ మీదకు వెళ్లాలనుకున్నామనుకోండి.. అందుకోసం సామాన్యులు ప్రయాణించే స్పేస్‌ షిప్‌లు ఉన్నాయా? లేదా భవిష్యత్తులో వ్యోమగామి అవ్వాలనుందా? అన్న దానిపై స్పష్టత ఉండాలి. అలాగే ఎంచుకున్న సమయంలోగా దాన్ని చేరుకోవడం సాధ్యమేనా అన్నదీ చూసుకోవాలి.

విభజించుకోండి.. లక్ష్యాన్ని తిరిగి చిన్న చిన్న వాటిగా విభజించుకోండి. ఈరోజు, నెలలో ఏం చేయాలన్న ప్రణాళిక వేసుకొని పూర్తి చేసుకుంటూ వెళ్లండి. అప్పుడు నిరాశ దరిచేరదు. ఏరోజు కారోజు పూర్తిచేసిన లక్ష్యం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. తద్వారా ఉత్పాదకత పెరగడమే కాదు.. పెద్ద లక్ష్యాన్ని సాధించగలమనే ఆత్మస్థైర్యమూ వస్తుంది.

తోటివారితో.. నేనూ.. నా కెరియర్‌ అన్న ధోరణీ మంచిది కాదు. నలుగురినీ కలుపుకొంటూ పోవడం రావాలి. పెద్దవారి సలహాలూ తీసుకోవాలి. అప్పుడే ఈ ప్రయాణం మరింత ఆనందంగా ఉంటుంది. ఆలోచనలు కలిసే వారితో బృందంగా ఏర్పడితే ఇంకా మంచిది. విలువైన సమాచారం, సలహాలు దొరుకుతాయి. అంతేకాదు వైఫల్యం ఎదురైనా.. నిరుత్సాహ పడినా మనలో స్ఫూర్తిని నింపడానికి వాళ్లెప్పుడూ ముందుంటారు. కాబట్టి, అలాంటి స్నేహం దక్కేలా చేసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్