Career-Second Innings: బ్రేక్‌ తర్వాత.. గెలుపు పిలుపు

ఎంత చదువుకుని ఏం లాభం? ఇద్దరు పిల్లలు పుట్టగానే వాళ్ల ఆలనాపాలనతోనే కాలం కరిగిపోతుంది. మధ్యలో వదిలేసిన ఉద్యోగంలోకి తిరిగి వెళ్లాలనున్నా.. ‘అన్నీ మారిపోయాయి’ అనే అనుమానం.

Published : 15 Mar 2023 04:34 IST

ఎంత చదువుకుని ఏం లాభం? ఇద్దరు పిల్లలు పుట్టగానే వాళ్ల ఆలనాపాలనతోనే కాలం కరిగిపోతుంది. మధ్యలో వదిలేసిన ఉద్యోగంలోకి తిరిగి వెళ్లాలనున్నా.. ‘అన్నీ మారిపోయాయి’ అనే అనుమానం. చెయ్యగలనో లేదో అనే బిడియం. మీరూ అలా సతమతమవుతున్నవారేనా? మహిళలు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి కావాల్సిన అవకాశాలెన్నో ఉన్నాయి. అవేంటో చూడండి...

మ్మాయిలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు ఇస్తూనే సంస్థలు వారి శక్తినీ, ఉత్పాదకత సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటున్నాయి. అందుకే, ఉద్యోగానికి విరామం ఇచ్చిన మహిళలు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించడానికి అవసరమైన చేయూతనిస్తున్నాయి. వీటిల్లో కొన్ని కంపెనీలు తమ దగ్గర కొలువు మానేసిన వారికోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి విధుల్లోకి తిరిగి తీసుకుంటున్నాయి. మరికొన్నేమో కెరియర్‌ బ్రేక్‌ తీసుకున్న అమ్మాయిలకు మార్కెట్‌ అవసరాలకు తగ్గ సాంకేతికత, విధానాలపై నైపుణ్యాల శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాల్ని మెరుగుపరుస్తున్నాయి.

టాటా- సెకండ్‌ కెరియర్స్‌ ఇన్‌స్పైరింగ్‌ పాజిబిలిటీస్‌ (ఎస్‌సీఐపీ).  విరామం తర్వాత తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు అవసరమైన వనరులను సమకూర్చడంతో పాటు నైపుణ్యాల శిక్షణ అందిస్తుందీ సంస్థ. ఐటీ, ఇంజినీరింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, మార్కెటింగ్‌, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌...ఇలా నచ్చిన విభాగంలో చేరి నిపుణుల మార్గనిర్దేశనం అందుకోవచ్చు. మూడు నెలల నుంచి ఏడాది పాటు రెండు రకాల కోర్సులను ఈ సంస్థ నిర్వహిస్తోంది. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అందుబాటులో ఉన్నవాటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైనవారిని సంస్థ ప్రతినిధులు సంప్రదిస్తారు.

కాగ్నిజెంట్‌ -‘రిటర్న్‌షిప్‌ ప్రోగ్రాం’:  కెరియర్‌లో కొంత గ్యాప్‌ వచ్చాక మళ్లీ తిరిగి ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్న వారిలో మహిళలే ఎక్కువ. ఇలాంటివారి కోసం కాగ్నిజెంట్‌ ‘రిటర్న్‌షిప్‌ ప్రోగ్రాం’ని తీసుకొచ్చింది. ఇందులో 12 వారాల ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తగిన నైపుణ్యాల శిక్షణ ఇవ్వడంతో పాటు అవసరమైన ఇతర వనరులను సమకూర్చడం ద్వారా మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను సిద్ధం చేస్తారు. ప్రతిభ ఆధారంగా శిక్షణ పొందిన వారికి కాగ్నిజెంట్‌ సంస్థలోనే ఫుల్‌ టైమ్‌ పొజిషన్‌ను ఆఫర్‌ చేస్తారు.

విప్రో- ‘బిగిన్‌ ఎగైన్‌’: విశ్రాంతి, మాతృత్వం, వృద్ధుల సంరక్షణ, ప్రయాణం, అభిరుచి.. మరేదైనా వ్యక్తిగత కారణాల వల్ల విరామం తీసుకున్న వారికి ఈ కార్యక్రమం సదవకాశాన్ని కల్పిస్తుంది. ఆరు నెలల నుంచి ఏడాదికి పైగా విరామం తీసుకున్న మహిళా నిపుణులెవరైనా ఇందులో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆక్సెంచర్‌- ‘కెరియర్‌ రీబూట్‌’: విరామం తర్వాత ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఆరునెలల ప్రత్యేక శిక్షణతో అవకాశాలు కల్పిస్తోంది. దీనిద్వారా పరిశ్రమ నిపుణులు, వివిధ విభాగాల లీడర్స్‌తో కలిసి పనిచేసే అవకాశం కల్పించడం ద్వారా వీరిలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారు. నైపుణ్యాలను మెరుగుపరుస్తారు. ఫలితంగా కెరియర్‌ పునరుద్ధరణకు చక్కటి మార్గం దొరుకుతుంది. ఫైనాన్స్‌- అకౌంటింగ్‌, బీపీఓ నేపథ్యం ఉన్నవారెవరైనా అన్ని వివరాలతో రెజ్యూమెను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తే చాలు. వారి అర్హతలతో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.


ప్రముఖ కార్పొరేట్‌ సంస్థలైన జీఈ ఇండియా ‘రీ-స్టార్ట్‌’, గూగుల్‌ సంస్థ ‘జికెరీర్‌’, గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ ‘రిటర్న్‌షిప్‌’, యాక్సిస్‌ బ్యాంక్‌ ‘రీ-కనెక్ట్‌’, గోద్రెజ్‌ ‘కెరియర్‌ 2.0’, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ ‘కెరియర్‌ బై ఛాయిస్‌’, మహీంద్రా లాజిస్టిక్స్‌ సంస్థ ‘సెకండ్‌ కెరియర్‌ ప్రోగ్రామ్స్‌(ఉడాన్‌)... వంటి ప్రత్యేక విధానాలతో కెరియర్‌ రీస్టార్ట్‌ చేయాలనుకుంటున్న మహిళా ఉద్యోగులకు చేయూతనందిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్