ప్రయాణాల కోసం ‘సోప్‌ పేపర్‌’!

పేరుకు తగ్గట్లే ఇవి పేపర్‌ను పోలి ఉన్న చిన్న చిన్న స్ట్రిప్స్‌ మాదిరిగా ఉంటాయి. గుండ్రంగా, స్టార్‌ ఆకృతిలో, కాస్త పొడవుగా.. ఇలా విభిన్న ఆకృతుల్లో, రంగుల్లో, ఫ్లేవర్స్‌లో రూపొందించిన వీటిలో ఒక స్ట్రిప్‌/పేపర్‌ని చేతిలోకి తీసుకొని, నీటితో కాస్త తడి చేయగానే పేపర్‌ కరిగిపోయి నురగ వచ్చేస్తుంది. దీంతో చేతులు శుభ్రం చేసుకోవచ్చు.

Published : 19 Apr 2024 13:20 IST

ఆఫీస్‌ అనో, వెకేషన్‌ అనో, లేదంటే ఇతర పనుల మీదనో తరచూ బయటికి వెళ్తుంటాం. ఈ క్రమంలో చేతులు శుభ్రం చేసుకోవడానికి నీళ్లు అందుబాటులో ఉన్నా, సబ్బు అందుబాటులో ఉండకపోవచ్చు.. అలాగని మనం ఇంట్లో ఉపయోగించే సబ్బుల్ని వెంట తీసుకెళ్లలేం. ఈ క్రమంలోనే చాలామంది మినీ హ్యాండ్‌వాష్‌/ఫేస్‌వాష్‌ ట్యూబ్‌/బాటిల్‌ను తమ బ్యాగ్‌లో ఉంచుకుంటారు. అయితే వీటికీ ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం ‘సోప్‌ పేపర్స్‌’ మార్కెట్లోకొచ్చాయి.

పేరుకు తగ్గట్లే ఇవి పేపర్‌ను పోలి ఉన్న చిన్న చిన్న స్ట్రిప్స్‌ మాదిరిగా ఉంటాయి. గుండ్రంగా, స్టార్‌ ఆకృతిలో, కాస్త పొడవుగా.. ఇలా విభిన్న ఆకృతుల్లో, రంగుల్లో, ఫ్లేవర్స్‌లో రూపొందించిన వీటిలో ఒక స్ట్రిప్‌/పేపర్‌ని చేతిలోకి తీసుకొని, నీటితో కాస్త తడి చేయగానే పేపర్‌ కరిగిపోయి నురగ వచ్చేస్తుంది. దీంతో చేతులు శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ముఖం కడుక్కోవడానికి వీలుగా ‘ఫేస్‌వాష్‌ పేపర్‌ సోప్స్’ కూడా దొరుకుతున్నాయి. మరికొన్ని చిన్న చిన్న ట్యాబ్లెట్స్‌ మాదిరిగా ఉన్నవీ లభిస్తున్నాయి. ఈ స్ట్రిప్స్‌తో కూడిన బాక్స్‌ని మన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉంచుకుంటే సరి.. ఎక్కడంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు. ఈ వేసవిలో ఈ సోప్‌ పేపర్స్‌తో మరింత పరిశుభ్రంగా ఉండచ్చు.. తాజాదనంతో మెరిసిపోవచ్చు.

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్