Published : 25/11/2021 20:00 IST

చర్మంపై ర్యాషెస్‌ పోవాలంటే ఏం చేయాలి?

హలో మేడం. నా చర్మంపై దద్దుర్లు (ర్యాషెస్‌) వచ్చాయి. దాంతో నల్ల మచ్చలు ఏర్పడ్డాయి. అవి పోవడానికి ఏవైనా ఇంటి చిట్కాలుంటే చెప్పండి. - ఓ సోదరి

జ: దద్దుర్లు అంటే అది చెమట పొక్కా..? ఏదైనా క్రీమ్‌ వాడడం వల్ల వచ్చిందా..? చేతులు-ముఖంపై దద్దుర్లు వచ్చాయా..? లేదంటే శరీరమంతా ఈ సమస్య ఉందా..? ఏదైనా మెడిసిన్‌ వాడడం వల్ల శరీరంపై వచ్చిన రియాక్షనా? ఇలా మీ అసలు సమస్య ఏది అనేది మీరు కరక్ట్‌గా చెప్పలేదు. ఒకవేళ ముఖంపై వచ్చిన దద్దుర్లు అయితే ఆ ప్రదేశంలో ఐస్‌క్యూబ్‌తో రుద్దుకుంటే సరిపోతుంది. రోజూ పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు దద్దుర్లు వచ్చిన చోట ఐస్‌క్యూబ్‌తో మసాజ్‌ చేసుకుంటే కొన్ని రోజులకు ర్యాష్‌ పోతుంది.

అలాగే ముఖం, చేతులపై ర్యాష్‌ ఉన్నట్లయితే బకెట్‌ నీళ్లలో కొన్ని ఐస్‌ ముక్కలు వేసుకొని ఆ నీటితో ముఖాన్ని, చేతుల్ని తరచూ శుభ్రం చేసుకుంటుండాలి. ఆపై గంధం ప్యాక్‌ వేసుకోవచ్చు. ఇందుకోసం గంధం అరగదీసి నేరుగా మచ్చలున్న చోట అప్లై చేసుకోవాలి. లేదంటే గంధంలో రోజ్‌వాటర్‌ వేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. (అయితే ఇందులో పాలు ఉపయోగించకూడదు. ఎందుకంటే పాలలో జిడ్డుదనం ఎక్కువగా ఉంటుంది.) ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులు.. ఇలా ర్యాష్‌ ఉన్న భాగాల్లో పూతలా వేసుకొని కాసేపటి తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా రోజుకోసారి పదిహేను రోజుల పాటు చేస్తే చక్కటి ఫలితం కనిపిస్తుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని