Canada: కెనడాలో 10లక్షల ఉద్యోగాలు ఖాళీ..!

కెనడాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఆ దేశ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది.

Published : 07 Aug 2022 14:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెనడాలో భారీ ఎత్తున ఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు ఆ దేశ లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. 2022 మేతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగి మొత్తం 10లక్షలను దాటేశాయి. చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉన్నట్లు సర్వే పేర్కొంది. దీనికి తోడు కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది రిటైర్మెంట్‌ వయస్సుకు దగ్గరపడటంతో విదేశీ కార్మికులకు డిమాండ్‌ పెరుగుతోంది.

ఈ ఏడాది  కెనడా అత్యధికంగా 4.3 లక్షల మందికి పౌరసత్వం ఇచ్చే అవకాశం ఉంది. ఈ లక్ష్యం 2024 నాటికి  4.5 లక్షలకు చేరవచ్చని అంచనా. ఈ  పరిస్థితుల్లో ఉద్యోగావకాశాలు కూడా ఎక్కువగా ఉండటం వలసదారులను ఆకర్షిస్తోంది. వృత్తి నిపుణులు, సైంటిఫిక్‌-టెక్నికల్‌ సేవలు అందించేవారు, రవాణా, గోదాములు, ఫైనాన్స్‌, ఇన్యూరెన్స్‌, వినోద రంగం, రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అత్యధిక ఖాళీలు ఉన్నాయి. వీటితోపాటు నిర్మాణ రంగంలో కూడా 89,900 ఖాళీలు ఉన్నాయి. విద్యారంగంలో 9,700 ఖాళీలు ఏర్పడ్డాయి. ఇక ఆహార సేవల రంగంలో ఖాళీలు ఫిబ్రవరి నుంచి 10శాతం పెరిగాయి.

రానున్న పదేళ్లలో దాదాపు 90 లక్షల మంది రిటైర్మెంట్‌కు దగ్గర కానున్నారు. వాస్తవానికి కెనడాలో చాలా చిన్న వయస్సులోనే రిటైర్మెంట్లు తీసుకొంటారు. ప్రతి 10 రిటైర్మెంట్లలో మూడు ముందుగా తీసుకునేవే ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని