అమెరికా వర్సిటీల్లో అరెస్టుల పర్వం

గాజాలో అమెరికా-హమాస్‌ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది.

Published : 26 Apr 2024 05:24 IST

ఉద్ధృతమవుతున్న పాలస్తీనా అనుకూల ప్రదర్శనలు

ఆస్టిన్‌: గాజాలో అమెరికా-హమాస్‌ మధ్య జరుగుతున్న పోరు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రకంపనలు రేపుతోంది. గత కొన్ని రోజులుగా పాలస్తీనాకు అనుకూలంగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా వర్సిటీల్లో జరుగుతున్న ఆందోళనలు ఉద్ధృతరూపం దాలుస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు పోలీసులను రంగంలోకి దింపాయి. భారీ సంఖ్యలో అరెస్టులు నమోదవుతున్నాయి. బోస్టన్‌లోని ఎమర్సన్‌ కళాశాలలో 108 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నలుగురు పోలీసులకు గాయాలయ్యాయి. బుధవారం రాత్రి సదరన్‌ కాలిఫోర్నియా వర్సిటీలో 93 మంది అరెస్టయ్యారు. ఈ మొత్తం ఆందోళనలకు కేంద్రంగా నిలిచిన కొలంబియా యూనివర్సిటీలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడి విద్యార్థులతో వర్సిటీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని