భారత ప్రజాఫిర్యాదు పరిష్కార వ్యవస్థ భేష్‌

భారత్‌లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్‌వెల్త్‌ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది.

Published : 26 Apr 2024 05:21 IST

కామన్‌వెల్త్‌ దేశాల్లోనే అత్యుత్తమం

లండన్‌: భారత్‌లోని కేంద్రీకృత ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ.. కామన్‌వెల్త్‌ దేశాల్లోనే అత్యుత్తమంగా నిలిచింది. 56 దేశాలకు చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కామన్‌వెల్త్‌ హెడ్స్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ భేటీ.. సోమవారం నుంచి బుధవారం వరకు లండన్‌లో జరిగింది. ఇందులో భారత పరిపాలనా శాఖ తమ పనితీరుపై ఒక సవివర సమర్పణ చేసింది. ‘‘ఇందులో కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కార, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజీఆర్‌ఏఎంఎస్‌) పాలనా సంస్కరణల శాఖ కార్యదర్శి వి.శ్రీనివాస్‌ ఒక ప్రజెంటేషన్‌ ఇచ్చారు. సభ్య దేశాల నుంచి దీనికి ప్రశంసలు అందాయి’’ అని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని