అంతరిక్ష కేంద్రానికి పయనమైన చైనా వ్యోమగాములు

చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది.

Published : 26 Apr 2024 05:21 IST

జియుక్వాన్‌: చైనా శుక్రవారం తన రోదసి కేంద్రంలోకి ముగ్గురు వ్యోమగాములను పంపింది. 2030 నాటికి చందమామపైకి మానవులను పంపాలన్న లక్ష్యంలో భాగంగా దీన్ని చేపట్టింది. యె గువాంగ్‌ఫు, లీ కాంగ్‌, లీ గువాంగ్సు అనే ఈ ముగ్గురు వ్యోమగాములు షెంఝౌ-18 వ్యోమనౌకలో నింగిలోకి పయనమయ్యారు. లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ రాకెట్‌ దీన్ని మోసుకెళ్లింది. వాయవ్య చైనాలోని జియుక్వాన్‌ అంతరిక్ష కేంద్రం ఈ ప్రయోగానికి వేదికైంది. ఈ వ్యోమగాములు భూకక్ష్యలోని చైనా అంతరిక్ష కేంద్రం ‘తియాంగాంగ్‌’లో ఆరు నెలలు పాటు విధులు నిర్వర్తిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని