మరో వాణిజ్య నౌకపై హూతీల దాడి!

ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్‌ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ తెలిపింది.

Published : 26 Apr 2024 05:21 IST

దుబాయ్‌: ఎర్ర సముద్రంలో మళ్లీ వాణిజ్య నౌకలపై హూతీ వేర్పాటువాదుల దాడులు ప్రారంభమయ్యాయి. ఏడెన్‌ జలసంధి సమీపంలో ఓ నౌకపై గురువారం దాడి జరిగినట్లు యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మారిటైమ్‌ ట్రేడ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ తెలిపింది. దాడికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని పేర్కొంది. హూతీలు ప్రయోగించిన నాలుగు డ్రోన్లు, ఓ క్షిపణిని కూల్చివేశామని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ తాజా దాడి జరగడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని