Eiffel Tower: ఈఫిల్‌ టవర్‌కు బాంబు బెదిరింపు.. పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్‌

ఈఫిల్‌ టవర్‌లో బాంబు అమర్చామంటూ కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో ఆ పరిసరాల్లో బాంబు నిర్వీర్య బృందాలు తనిఖీలు చేపడుతున్నాయి.

Updated : 13 Aug 2023 14:04 IST

పారిస్‌: ఫ్రాన్స్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ను (Eiffel Tower) కూల్చివేసేందుకు బాంబు అమర్చామంటూ కొందరు దుండగులు ఫోన్‌ చేసి బెదిరించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. ఆ పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సందర్శకులందర్నీ అక్కడి నుంచి బయటకి పంపేశారు. పోలీసులు సహా బాంబు నిర్వీర్య బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఈ అద్భుత నిర్మాణాన్ని చూసేందుకు ప్రతి ఏటా దేశ విదేశాల నుంచి లక్షలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గతేడాది 62 లక్షల మంది ఈ కట్టడాన్ని సందర్శించినట్లు రికార్డులు చెబుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని