Elon Musk: ఇజ్రాయెల్‌లో ఎలాన్‌ మస్క్‌

యూదు వ్యతిరేక విమర్శల వేళ.. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు.

Updated : 28 Nov 2023 13:18 IST

జెరూసలెం: ఇజ్రాయెల్- హమాస్‌ యుద్ధం (Israel Hamas Conflict) వేళ.. సామాజిక మాధ్యమ సంస్థ ‘ఎక్స్‌ (X)’లో యూదు వ్యతిరేక పోస్టులు రావడం, వాటిలో కొన్నింటికి ఆ సంస్థ యజమాని ఎలాన్‌ మస్క్‌ మద్దతు పలకడం ఇటీవల తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాల నడుమ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) నేడు ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ప్రధాని నెతన్యాహు (Netanyahu)తో కలిసి.. అక్టోబరు 7న హమాస్‌ దాడులకు గురైన దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ ప్రాంతాన్ని (Kfar Azza kibbutz) సందర్శించారు. అక్కడున్న అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనాస్థలంలో తన ఫోన్‌లో ఫొటోలూ తీశారు.

‘ఎలాన్‌ మస్క్‌ అయితే ఏంటీ.. అది తప్పే’: రిషి సునాక్‌ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. ఎక్స్‌ వేదికగా యూదు వ్యతిరేక యూజర్లతో ఇటీవల మస్క్‌ సంభాషణలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యూదులు, శ్వేతజాతీయులను కించపర్చేలా ఓ యూజర్‌ పెట్టిన పోస్ట్‌కు మస్క్‌ స్పందిస్తూ.. ‘సరిగ్గా చెప్పారు’ అని అనడం విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే మస్క్‌ తీరుపై మండిపడిన యాపిల్‌, డిస్నీ వంటి కొన్ని దిగ్గజ సంస్థలు.. ‘ఎక్స్‌’లో తమ యాడ్స్‌ను నిలిపివేశాయి. ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. మస్క్‌ సోమవారం ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలోనే ప్రధాని నెతన్యాహు, ఇతర ప్రముఖులతో మస్క్‌ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని