కొలంబియా వర్సిటీలో ఉద్రిక్తతలు

గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి.

Published : 01 May 2024 04:52 IST

హామిల్టన్‌ హాల్‌ దిగ్బంధనం
విద్యార్థులతో చర్చలు విఫలం

న్యూయార్క్‌: గాజా యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల్లో కీలక పాత్ర పోషిస్తున్న న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో పరిస్థితులు మంగళవారం ఉద్రిక్తంగా మారాయి. గత కొన్ని రోజులుగా విద్యార్థులు, అధికారుల మధ్య జరుగుతున్న చర్చలు విఫలమయ్యాయి. వర్సిటీ ప్రాంగణంలో 120 గుడారాలను తొలగించడానికి ఆందోళనకారులు నిరాకరించారు. దీంతో నిబంధనలను ఉల్లంఘించిన వారిని సస్పెండ్‌ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని హామిల్టన్‌ హాల్‌ను విద్యార్థులు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 1968లో జరిగిన పౌరహక్కుల ఉద్యమంలో, వియత్నాం యుద్ధ వ్యతిరేక ఆందోళనల్లో ఈ హాల్‌ కీలక పాత్ర పోషించింది. హామిల్టన్‌ హాల్‌కు హింద్‌ రజబ్‌ హాల్‌గా విద్యార్థులు పేరు మార్చారు. గాజాలో ఇజ్రాయెల్‌ దాడిలో చనిపోయిన ఆరేళ్ల రజబ్‌ పేరును దీనికి పెట్టారు. టెక్సాస్‌ యూనివర్సిటీలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. విద్యార్థులపై పెప్పర్‌ స్ప్రే ప్రయోగించారు. ఆందోళనకారులతో నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. జూన్‌ 1 వరకు శాంతియుత ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు విద్యార్థులకు అధికారులు అనుమతినిచ్చారు. యేల్‌ యూనివర్సిటీలో మళ్లీ గుడారాలు వెలిశాయి. గత వారం 50 మందిని అరెస్టు చేయడంతో వెనక్కి తగ్గిన విద్యార్థులు మళ్లీ ఆందోళనలు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని