‘ఇజ్రాయెల్‌’ కేసులో జర్మనీకి ఊరట

గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది.

Published : 01 May 2024 05:13 IST

అంతర్జాతీయ న్యాయస్థానంలో నికరాగువా పిటిషన్‌ తిరస్కరణ

 ది హేగ్‌: గాజాలో పాలస్తీనియన్లపై నరమేధానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న జర్మనీని నిరోధించాలని కోరుతూ నికరాగువా దేశం చేసిన విజ్ఞప్తిని మంగళవారం అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తిరస్కరించింది. అలాంటి ఉత్తర్వులు ఇచ్చేందుకు అవసరమైన న్యాయ నిబంధనలకు అనుగుణంగా విజ్ఞప్తిలేదని పేర్కొంది. ఆయుధ సరఫరా నిలిపివేతతో పాటు, ఐక్యరాజ్యసమితి సహాయక ఏజెన్సీకి ఆపివేసిన సాయాన్ని పునరుద్ధరించాల్సిందిగా జర్మనీని ఆదేశించాలని కూడా నికరాగువా కోరింది. గాజాపై పోరు ప్రారంభమైనప్పటి నుంచి తాము ఎలాంటి ఆయుధాలను ఇజ్రాయెల్‌కు సరఫరా చేయలేదని జర్మనీ తన వాదనల్లో తెలిపింది. నరమేధం ఆరోపణలను ఇజ్రాయెల్‌ ఖండించింది. నికరాగువా దేశం తొలి నుంచి పాలస్తీనీయన్లకు మద్దతుగా నిలుస్తున్న దేశం. గతేడాది దక్షిణాఫ్రికా కూడా ఇజ్రాయెల్‌పై నరమేధం ఆరోపణలు చేస్తూ ఐసీజేను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో గాజాలో మరణాలను, విధ్వంసాన్ని, నరమేధాన్ని నివారించాలని ఇజ్రాయెల్‌ను ఐసీజే ఆదేశించింది.

 టెల్‌ అవీవ్‌ విమానాలు మే 15 వరకు రద్దు

దిల్లీ: ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య పోరుతో పశ్చిమాసియాలో ఉద్రికత్తల నేపథ్యంలో టెల్‌ అవీవ్‌కు విమానాల రద్దును మే 15 వరకు పొడిగిస్తున్నట్లు ఎయిరిండియా మంగళవారం ప్రకటించింది. ఏప్రిల్‌ 30 వరకు విమానాలు రద్దవుతాయని తొలుత ప్రకటించగా దానిని 15 రోజులపాటు పెంచింది. దిల్లీకి, టెల్‌ అవీవ్‌కు మధ్య వారంలో నాలుగు విమానాలు నడవాల్సి ఉంది. టికెట్ల రద్దు రుసుములు లేకుండా పూర్తి సొమ్ము వాపసు పొందడానికి, లేదా ప్రయాణ తేదీని ఒకసారి మార్చుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని