అమెరికాలో మరోసారి కాల్పుల మోత

కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు.

Published : 01 May 2024 04:51 IST

నలుగురు అధికారులు, నిందితుడి మృతి

షార్లెట్‌: కాల్పుల మోతతో అగ్రరాజ్యం అమెరికా మరోసారి ఉలిక్కిపడింది. నార్త్‌ కరోలినాలోని షార్లెట్‌లో వారెంటు అందించేందుకు వెళ్లిన పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు ఓ దుండగుడు. ఈ అనూహ్య దాడిలో నలుగురు పోలీసులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా యూఎస్‌ మార్షల్స్‌ టాస్క్‌ ఫోర్స్‌కు చెందిన అధికారులు. అక్రమంగా ఆయుధాలను కలిగి ఉన్నాడన్న కారణంతో వారెంటును అందించేందుకు సోమవారం కొంతమంది అధికారులు ఓ నిందితుడి ఇంటికి వెళ్లారు. వీరి రాకను గమనించిన నిందితుడు దాడికి దిగడంతో  మూడు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిందితుడితోపాటు మరో నలుగురు అధికారులు మృతిచెందారు. అనంతరం ఆ ఇంటిలో నివసిస్తున్న ఓ మహిళ, 17ఏళ్ల యువకుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరో రైఫిల్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని