లండన్‌లో కత్తితో దాడి

తూర్పు లండన్‌లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్‌ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు.

Published : 01 May 2024 05:13 IST

13 ఏళ్ల బాలుడి మృతి

లండన్‌: తూర్పు లండన్‌లో మంగళవారం ఓ వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. హైనాల్ట్‌ ప్రాంతంలో వాహనంలో ఓ ఇంట్లోకి దూసుకెళ్లిన అనంతరం దాడికి దిగాడు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలుడు మరణించాడని, ఇద్దరు పోలీసులు సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిని ఉగ్రవాద చర్యతో ముడిపెట్టలేమని స్పష్టంచేశారు. 36 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని