కొవిషీల్డ్‌తో కొన్ని దుష్పరిణామాలు నిజమే

కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది.

Published : 01 May 2024 05:12 IST

అంగీకరించిన ఆస్ట్రాజెనకా

లండన్‌: కొవిడ్‌ టీకా కొవిషీల్డ్‌తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా అంగీకరించింది. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ దినపత్రిక ‘ది టెలిగ్రాఫ్‌’ ఓ కథనం ప్రచురించింది. కొవిషీల్డ్‌ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ పడిపోవటం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్త్రాల్లో పేర్కొనట్లు తెలిపింది.

100 మిలియన్‌ పౌండ్లకు కేసు

ఆస్ట్రాజెనకాపై బ్రిటన్‌లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. కొవిషీల్డ్‌ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతోపాటు తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్‌ హైకోర్టులో 50మందికి పైగా బాధితులు 100 మిలియన్‌ పౌండ్ల నష్ట పరిహారం కోరుతూ కేసులు వేశారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన ఆస్ట్రాజెనకా, అరుదైన సందర్భాల్లో సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని