Evergreen: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. బోనస్‌గా ఐదేళ్ల జీతం!
తైవాన్‌కు చెందిన షిప్పింగ్ సంస్థ ఎవర్‌గ్రీన్ (Evergreen) సంస్థ తన ఉద్యోగులకు దాదాపు ఐదేళ్ల జీతాన్ని బోనస్‌గా ప్రకటించింది.
ఇంటర్నెట్‌డెస్క్: సాధారణంగా ఉద్యోగులకు (Employees) ఒకట్రెండు నెలల జీతం బోనస్‌గా వస్తేనే ఎంతో సంబరపడిపోతారు. అలాంటింది ఒకటికాదు..రెండుకాదు.. ఏకంగా ఐదేళ్ల వేతనం బోనస్ (Bonus)గా ఇస్తుంటే ఆ ఉద్యోగులు ఇంకెంత ఆనందంగా ఫీలవుతారో చెప్పండి. నిజమే.. తైవాన్‌కు చెందిన ఎవర్‌గ్రీన్ అనే షిప్పింగ్ సంస్థ తమ ఉద్యోగులకు ఇయర్ ఎండ్ బోనస్ కింద ఇప్పటికే 50 నెలల జీతాన్ని బోనస్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 నుంచి 11 నెలల వేతనాన్ని మిడ్ ఇయర్ బోనస్ కింద చెల్లించాలని నిర్ణయించింది. అంటే దాదాపు 5ఏళ్ల జీతాన్ని ఆ సంస్థ ఉద్యోగులు బోనస్‌గా అందుకోనున్నారు. కేవలం మిడ్ ఇయర్ బోనస్ కింద దాదాపు 94 మిలియన్ డాలర్లు మేర చెల్లించే అవకాశం ఉన్నట్టు అక్కడి వార్తా సంస్థ వెల్లడించింది.
కరోనా మహమ్మారి సమయంలో సూయిజ్ కెనాల్‌లో ఓ భారీ నౌక చిక్కుకుపోయి కొన్ని రోజుల పాటు ఆ మార్గంలో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. అది ఎవర్‌గ్రీన్ సంస్థకు చెందినదే. ఈ షిప్పింగ్ సంస్థ కరోనా కాలంలో భారీ నష్టాలను కూడా చవి చూసింది. అయితే, ఆ తర్వాత పరిస్థితులు సద్దుమణగడం, ప్రపంచవాప్తంగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో గత రెండేళ్లుగా 39.92 శాతం మేర లాభాలను ఆర్జిస్తోంది. ఉద్యోగుల కృషిఫలితంగానే ఇంత భారీగా లాభాలు వచ్చాయని భావించని ఆ సంస్థ.. ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్‌కు ఎంపిక చేసింది. ఈ ఏడాది మధ్యలో వారి ఖాతాల్లో ఈ మొత్తాన్ని జమచేస్తామని ఎవర్‌గ్రీన్ పేర్కొన్నట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి.
తైవాన్‌లో ఆర్థిక సంవత్సరం డిసెంబరు 31తో ముగుస్తుంది. అయితే, తాజాగా డిసెంబరు 31, 2022 నాటికి ఎవర్‌గ్రీన్ రికార్డు స్థాయిలో లాభాలను ఆర్జించింది. NT334 బిలియన్ డాలర్లతో గతంలో ఎన్నడూ లేనంతగా లాభాలు సాధించింది. ఇంతటి విజయానికి ఉద్యోగులే కారణమని భావించిన ఎవర్‌గ్రీన్.. తమ సంస్థలో పని చేస్తున్న 3,100 మంది ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించింది. ఈ సంస్థలో పని చేసే ఉద్యోగుల వార్షిక వేతనం దాదాపు 29,545 డాలర్ల నుంచి.. 1,14,823 డాలర్ల వరకు ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్ల బోనస్ అంటే వాళ్లకి సగటున ఎంత వస్తుందో అంచనా వేయొచ్చు. ఎవర్‌గ్రీన్ ఉద్యోగులకు 5 సంవత్సరాల జీతాన్ని బోనస్‌గా ప్రకటించారన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వ్యాపించాయి. దీంతో ఆ సంస్థ ఉద్యోగులను చూస్తే అసూయ కలుగుతోందంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Abhiram: భయంతో నిద్ర పట్టడం లేదు.. తేజ అందరి ముందు తిట్టారు: అభిరామ్
-
World News
Ross: 54 ఏళ్ల నిరీక్షణ.. 71 ఏళ్ల వయస్సులో డిగ్రీ పట్టా!
-
Crime News
Crime News: కార్ ట్రావెల్స్ పెట్టాలన్న కోరికే డ్రైవర్ కొంపముంచింది
-
Movies News
ఆ సినిమా చూసి నా భార్య నన్ను తిట్టింది: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ నటుడు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/05/2023)