రష్యాలో ఘనంగా విక్టరీ డే సంబరాలు

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు.

Published : 10 May 2024 05:18 IST

మాస్కో: రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీని ఓడించినందుకు గుర్తుగా జరుపుకొనే ‘విక్టరీ డే’ వేడుకలను రష్యాలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపించింది. మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన భారీ కవాతులో దాదాపు 9 వేల మంది సైనికులు పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడిగా ఇటీవలే అయిదోసారి బాధ్యతలు చేపట్టిన వ్లాదిమిర్‌ పుతిన్‌ రెడ్‌ స్క్వేర్‌ వద్ద ప్రసంగిస్తూ.. రెండో ప్రపంచ యుద్ధంలో తమ సైనికులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకున్నారు. సురక్షిత, స్వేచ్ఛాయుత రష్యా కోసం అందరూ ఐక్యంగా కృషిచేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఉక్రెయిన్‌తో యుద్ధంలో పోరాడుతున్న తమ దేశ సైనికులపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ప్రాంతీయ ఘర్షణలు, జాతి-మతపరమైన విభేదాలను ఎగదోస్తున్నాయంటూ పశ్చిమ దేశాలపై మండిపడ్డారు. అంతర్జాతీయ ఘర్షణను నివారించేందుకు రష్యా తనవంతుగా చేయాల్సిందంతా చేస్తుందని, అయితే తమపై ఎవరు బెదిరింపులకు పాల్పడినా ఊరుకోబోమని హెచ్చరించారు. తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరోసారి గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని