చైనాలో ఒక్కసారిగా కొవిడ్‌ విజృంభణ

చైనాలో కొవిడ్‌ కఠిన నిబంధనలు సడలించి పక్షం రోజులు పూర్తికాగా ఒక్కసారిగా మహమ్మారి ఉద్ధృతి పెరిగింది.

Published : 16 Dec 2022 06:20 IST

కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు

బీజింగ్‌: చైనాలో కొవిడ్‌ కఠిన నిబంధనలు సడలించి పక్షం రోజులు పూర్తికాగా ఒక్కసారిగా మహమ్మారి ఉద్ధృతి పెరిగింది. రాజధాని బీజింగ్‌తో పాటు పలు నగరాల్లో ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. చాలాచోట్ల గంటల తరబడి నిరీక్షిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నాయి. చాలామంది ఆసుపత్రుల బయట పార్కింగ్‌ స్థలాల్లో తమ వాహనాల్లోనూ నిరీక్షిస్తూ కనిపించారు. వీరిలో అధికసంఖ్యలో ప్రజలు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. ఒమిక్రాన్‌ వైరస్‌ రకం శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది డెల్టా వైరస్‌ అంత ప్రమాదకరమైనది కాదని నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని