NATO: నాటోలో ఐరోపా చిచ్చు!
రష్యాకు వ్యతిరేకంగా... అమెరికా సారథ్యంలో ఏర్పడ్డ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి.
అమెరికాతో అంటకాగబోమంటున్న ఫ్రాన్స్, జర్మనీ
వారికి బానిసలం కాము: మెక్రాన్
ఐరోపాకు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అవసరం
చైనా అధ్యక్షుడితో భేటీకాగానే ప్రకటన
రష్యాకు వ్యతిరేకంగా... అమెరికా సారథ్యంలో ఏర్పడ్డ నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఈ కూటమిలో ప్రధాన భాగస్వాములైన ఐరోపా దేశాలే ఇందుకు కారణం అవుతుండటం విశేషం. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీలు...నాటోకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికాతో అంటకాగటానికి నిరాకరిస్తుండటం; వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోరుకుంటుండటం...అమెరికాకు బానిసలం కామని ప్రకటించటం... ప్రపంచ భౌగోళిక రాజకీయ మార్పుల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామం!
రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు నాటో దేశాలన్నీ ఆయుధ, ఆర్థిక సాయం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే కొత్తగా 31వ దేశంగా ఫిన్‌లాండ్‌కు నాటో సభ్యత్వం కూడా ఇచ్చారు. పైకి ఇది నాటో విస్తరిస్తున్నట్లు, బలోపేతం అవుతున్నట్లు కనిపిస్తున్నా...లోలోన మాత్రం సరికొత్త విభజన రేఖలు పుట్టుకొస్తున్నాయి. ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెద్దన్న పాత్రను అంగీకరించేందుకు, దాన్ని అనుసరించేందుకు ఫ్రాన్స్, జర్మనీలు అంగీకరించటం లేదు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ తాజాగా ఈ విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు ప్రకటించటం విశేషం. ఇటీవలే ఆయన చైనాలో పర్యటించి, ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో భేటీ అయి వచ్చారు. ‘‘తైవాన్ విషయంలో అమెరికా, చైనాల మధ్య ఐరోపా ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో అమెరికానో, చైనానో అనుసరించాల్సిన అవసరం మాకు లేదు. ఐరోపా ఎవ్వరికీ బానిస కాదు... సంబంధం లేని సంఘర్షణల్లో ఇరుక్కునే ప్రమాదాన్ని అది ఎదుర్కొంటోంది. మాకు వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి అవసరం’’అని మెక్రాన్ వ్యాఖ్యానించారు.
బుధవారం నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా కూడా ఆయన ఈ వ్యాఖ్యలను పునరుద్ఘాటించటం విశేషం. ‘‘అమెరికా మిత్రపక్షం అయినంత మాత్రాన వారి చేతిలో పావులుగా/బానిసలుగా ఉంటామని అర్థం కాదు’’ అని ఫ్రాన్స్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. అమెరికా పెద్దన్న పాత్రపోషిస్తుండటంతో తమకు నిర్ణయాల్లో స్వయంప్రతిపత్తి లేకుండా పోతోందని మెక్రాన్ చెప్పకనే చెప్పారు. జర్మనీ కూడా దాదాపు ఇదే బాటలో పయనిస్తోంది. ఫ్రాన్స్ అగ్రనేత మాదిరిగా వ్యాఖ్యలు చేయకున్నా... జర్మనీ అధ్యక్షుడు కూడా చైనా వెళ్లి వచ్చారు. జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. నిజానికి...నాటో సభ్య దేశంగా, ఐరోపాలో కీలక దేశంగా, యుద్ధంలో ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నప్పటికీ రష్యా పట్ల కఠిన వైఖరికి జర్మనీ అంత సుముఖంగా లేదు. కారణం... ఇంధనం తదితర రంగాల్లో రష్యాపై భారీగా ఆధారపడి ఉండటమే. జర్మనీ సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు కొంతమందికి రష్యాతో తెగతెంపులు ఇష్టం లేదు. రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకొన్న జర్మనీ ఆయుధ సంపత్తిని సమకూర్చుకోగానే ఫ్రాన్స్ మాదిరిగానే గళం పెంచుతుందని అనుకుంటున్నారు. స్పెయిన్, పోర్చుగల్, ఇటలీలు కూడా ఫ్రాన్స్-జర్మనీ బాటలో పయనించే అవకాశాలు ఎక్కువ. ఇప్పటికే ఇటలీని రష్యా మిత్రదేశంగా నాటో కూటమి అనుమానిస్తుంది. టర్కీ పేరుకు నాటోలో ఉన్నా... రష్యా, అమెరికాలతో సమదూరం పాటిస్తోంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌లు గతంలోనే చైనాతో యూరోపియన్ యూనియన్ బంధాన్ని బలపరిచాయి.
వారిది అమెరికా బాట...
ఈ పరిణామాలు, మెక్రాన్ వ్యాఖ్యలు ఐరోపాలో, నాటో కూటమిలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు ఐరోపా దేశాలు పోలండ్, లాత్వియాలాంటి దేశాలతో పాటు నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్‌లాంటి దేశాలన్నీ నాటో సారథ్యాన్ని కోరుకుంటున్నాయి. కారణం... ఇవన్నీ చిన్నచిన్న దేశాలు. రష్యా ఆక్రమణ భయం వీటన్నింటినీ అమెరికా ఛత్రం కిందికి తీసుకొస్తోంది. డెన్మార్క్, స్వీడన్, ఫిన్లాండ్, నార్వేలు...ఏకంగా తమ వాయుసేనలను కలిపేసి ఒకే దళంగా ఏర్పాటు చేసుకున్నాయి కూడా. మెక్రాన్ వ్యాఖ్యలను యూరోపియన్ పార్లమెంటు ప్రతినిధి కొట్టిపారేశారు. ఆయన ఫ్రాన్స్ గురించి మాట్లాడుకోవాలిగాని... మొత్తం ఐరోపా గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ‘అమెరికా నుంచి వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కోరుకునే బదులు... అమెరికాతో కలసి వ్యూహాత్మక భాగస్వామ్యం కోరుకుంటే మంచిది’ అని పోలండ్ ప్రధాని సూచించటం గమనార్హం. మొత్తానికి... అమెరికా, దాని మిత్రదేశాల మధ్య చిచ్చురేపటంలో చైనా సఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి
-
Jagadish Reddy: సూర్యాపేటలో 26న ఐటీ జాబ్ మేళా: జగదీశ్‌రెడ్డి
-
Mayawati: బీఎస్పీ ఎంపీపై భాజపా ఎంపీ అభ్యంతరకర వ్యాఖ్యలు... మాయావతి రియాక్షన్ ఇదే!
-
Sidharth Luthra: సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా మరో ట్వీట్
-
Nene Naa Movie ott: ఓటీటీలోకి వచ్చేసిన రెజీనా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?