పాస్టర్‌ మాటలు నమ్మి నిరాహార దీక్ష.. 200 మంది మృతి

కెన్యాలో ఓ చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటివరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. గత నెల నుంచి అధికారులు షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు.

Published : 15 May 2023 05:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కెన్యాలో ఓ చర్చి పెద్ద నిర్వాకం కారణంగా ఇప్పటివరకు 200 మందికిపైగా ప్రాణాలు తీసుకొన్నారు. గత నెల నుంచి అధికారులు షకహోలా అటవీ ప్రాంతంలో మృతదేహాలను గుర్తిస్తూనే ఉన్నారు. శనివారం మరో 22 మృతదేహాలు బయటపడ్డాయి. వీరంతా రోజుల తరబడి ఆహారం తీసుకోకుండా ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించారు. మరో 600 మంది జాడ తెలియడం లేదు. పాల్‌ మెకంజీ అనే చర్చి పాస్టర్‌ ఈ అటవీ ప్రాంతంలోని ఓ ప్రాంగణంలో మకాం వేశాడు. ఆహారం తినకుండా తీవ్రమైన ఆకలితో మరణిస్తే ఏసు క్రీస్తును కలిసే అదృష్టం వస్తుందని ఉద్బోధించాడు. అతడి మాటలు నమ్మి నిరాహార దీక్షలు చేసిన అనుచరులు పెద్దసంఖ్యలో ప్రాణాలు విడిచారు. వీరి మృతదేహాలను ఆ ప్రాంగణంలోనే సామూహిక ఖననాలు చేశారు. ఈ విషయం తెలుసుకొన్న అధికారులు గత నెల మెకంజీని అదుపులోకి తీసుకొన్నారు. కొన్ని మృతదేహాల్లో శరీర భాగాలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని