400 రకాల ఔషధ మొక్కలకు మధుమేహ నియంత్రణ సామర్థ్యం

రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యం దాదాపు 400 రకాల ఔషధ మొక్కలకు ఉందని భారత శాస్త్రవేత్తల బృందం తేల్చింది.

Published : 31 May 2023 04:03 IST

దిల్లీ: రక్తంలో చక్కెర పరిమాణాన్ని నియంత్రించే సామర్థ్యం దాదాపు 400 రకాల ఔషధ మొక్కలకు ఉందని భారత శాస్త్రవేత్తల బృందం తేల్చింది. అయితే వాటిలో వేప, పసుపు, ఉసిరి, నేరేడు, మెంతి వంటి 21 రకాలపైనే లోతైన పరిశోధనలు జరిగాయని పేర్కొంది. మధుమేహాన్ని నియంత్రించేందుకు వాడే అనేకరకాల అల్లోపతి ఔషధాలకూ మూలికా నేపథ్యం ఉంటోందని తెలిపింది. అందువల్ల సహజసిద్ధ ఉత్పత్తులపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తే మరిన్ని కొత్త మందుల అభివృద్ధికి వీలు కలుగుతుందని వివరించింది. జిప్‌మెర్‌-పుదుచ్చేరి, ఎయిమ్స్‌-కల్యాణి శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలి రూపొందించిన బీజీఆర్‌-34 వంటి మూలికా ఔషధాలకు మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం ఉందని తెలిపారు. ఈ రుగ్మత బారినపడుతున్న వారి సంఖ్య  పెరుగుతున్న నేపథ్యంలో వనమూలికలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని