Zimbabwe - Elephants: జింబాబ్వే ఏనుగులపై ‘ఎల్‌నినో’ పిడుగు

జింబాబ్వేలో అతి పెద్దదైన హ్వాంగ్‌ జాతీయ పార్కులో ఏనుగుల మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Updated : 20 Dec 2023 10:31 IST

వారాల వ్యవధిలో 100కు పైగా మృత్యువాత

హరారే: జింబాబ్వేలో (Zimbabwe) అతి పెద్దదైన హ్వాంగ్‌ జాతీయ పార్కులో ఏనుగుల (Elephants) మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తీవ్రమైన కరవు పరిస్థితుల కారణంగా గత కొన్ని వారాల వ్యవధిలో కనీసం వంద ఏనుగులు మృత్యువాతపడ్డాయి. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం గురించి వన్యప్రాణి సంరక్షణ అధికారులు, సంస్థలు చేస్తూ వస్తున్న హెచ్చరికలకు ఈ ఏనుగుల మృత కళేబరాలు భయంకరమైన సంకేతాలని చెప్పవచ్చు. హ్వాంగ్‌ జాతీయ పార్కు ఉన్న ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఓవైపు వర్షాభావం.. మరోవైపు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మరిన్ని వన్యప్రాణులు అంతరించే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. 2019లోనూ ఇలాగే తీవ్రమైన కరవుతో ఈ పార్కులో 200కు పైగా ఏనుగులు మృత్యువాత పడ్డాయి. ఆ పరిస్థితులు పునరావృతం అవుతాయేమోనని అధికారులు కలతపడుతున్నారు. ఏనుగులు, ఇతర వన్యప్రాణుల మనుగడను ఇది సంక్షోభంలోకి నెడుతున్నట్లు జంతు సంరక్షణ అంతర్జాతీయ నిధి పేర్కొంటోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని