భూగర్భ డ్రైనేజీలో 36 గంటలు.. దాక్కొన్నాడా.. దబాలున పడ్డాడా!

ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో భూగర్భ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు దాదాపు 36 గంటలు అందులోనే చిక్కుకుపోయాడు.

Published : 27 Mar 2024 03:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్‌లో భూగర్భ డ్రైనేజీలోకి దిగిన ఓ యువకుడు దాదాపు 36 గంటలు అందులోనే చిక్కుకుపోయాడు. బ్రిస్‌బేన్‌లోని క్యాసిల్‌బార్‌ వీధిలో ఆదివారం నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తికి భూగర్భ డ్రైనేజీ నుంచి అరుపులు వినిపించాయి. లోనికి చూసి సాయం చేసేందుకు ప్రయత్నించగా.. అటువైపు నుంచి వద్దనే సమాధానం వచ్చింది. దీంతో అతడు వెళ్లిపోయాడు. సోమవారం మళ్లీ అదే వ్యక్తి అటువైపుగా వెళుతూ.. ‘రక్షించండి’ అనే కేకలు విన్నాడు. ఈసారి అతడు పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది డ్రైనేజీలో చిక్కుకున్న యువకుణ్ని సురక్షితంగా బయటకుతీసి, ఆసుపత్రికి తరలించారు. కిందపడిన ఫోను కోసమే అందులోకి దిగి చిక్కుకుపోయినట్లు యువకుడు చెబుతున్నప్పటికీ పోలీసుల కథనం మరోలా ఉంది. ఆదివారం ఉదయం ఆ మార్గంలో కొన్ని వాహనాలను ఓ గుర్తుతెలియని కారు ఢీ కొట్టుకుంటూ వెళ్లిందని, కారులో ఉన్న డ్రైవరు కిందికి దూకి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇతడేనని.. తమ నుంచి తప్పించుకునేందుకే డ్రైనేజీలో దాక్కొని ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని