నీరవ్‌ మోదీ బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణ

పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్‌ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 08 May 2024 05:47 IST

లండన్‌: పరారీలో ఉన్న వ్యాపారవేత్త, ఐదేళ్లుగా లండన్‌ జైల్లో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ తాజాగా మంగళవారం అక్కడి న్యాయస్థానంలో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితుడు విచారణకు గైర్హాజరయ్యే ముప్పు అధికంగా ఉందంటూ న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను తిరస్కరించారు. భారత్‌లో అక్రమాలు, నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం కింద అభియోగాలను ఎదుర్కొంటున్న నీరవ్‌.. తనను భారత్‌కు అప్పగించే విషయాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన కేసులో ఓటమి పాలయ్యారు. మరోవైపు, మంగళవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ న్యాయస్థానంలో బెయిలు పిటిషన్లపై జరిగిన విచారణకు నీరవ్‌ హాజరు కాలేదు. అదే సమయంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెలు గ్యాలరీలో కనిపించారు. నీరవ్‌కు బెయిలు అభ్యర్థిస్తూ మూడున్నర సంవత్సరాల క్రితం బెయిలు పిటిషన్‌ దాఖలు చేశామని, చాలా సమయం గడిచినందున మళ్లీ బెయిలు పిటిషన్‌ దాఖలు చేయడానికి వీలుగా పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్న ఆయన తరఫు న్యాయవాదుల బృందం చేసిన వాదనను న్యాయమూర్తి జాన్‌జానీ ఆమోదించారు. ‘‘అయితే బెయిలుకు వ్యతిరేకంగా గణనీయమైన కారణాలు ఉన్నట్లు నేను భావిస్తున్నాను. నీరవ్‌ మోదీ విచారణకు గైర్హాజరయ్యే ముప్పు గణనీయంగా ఉంది’’ అని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు