S Jaishankar: చైనా కారణంగానే సరిహద్దులో రక్తపాతం : జైశంకర్‌

చైనా తీరును ఎండగట్టిన భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌.. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు.

Updated : 07 Mar 2024 17:47 IST

టోక్యో: భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జై శంకర్‌.. అంతర్జాతీయ వేదికపై చైనా (China) తీరును మరోసారి తూర్పారపట్టారు. పొరుగుదేశం రాతపూర్వక ఒప్పందాలను పాటించకపోవడం ఆందోళనకర విషయమన్నారు. సరిహద్దుల్లో 2020లో (నాలుగు దశాబ్దాల్లో మొదటిసారి) చోటుచేసుకున్న రక్తపాతానికి చైనానే కారణమన్నారు. టోక్యోలో అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన రైసినా రౌండ్‌టేబుల్‌ ప్రారంభ సమావేశంలో మాట్లాడిన విదేశాంగ మంత్రి (S Jaishankar).. చైనా తీరుపై నిప్పులు చెరిగారు.

‘ఇండో పసిఫిక్‌ ప్రాబల్యంలో మార్పు అనేది వాస్తవం. సామర్థ్యాలు, ప్రభావం, ఆశయాల్లో భారీ స్థాయిలో మార్పులు జరుగుతున్నప్పుడు వ్యూహాత్మక పరిణామాల్లోనూ మార్పులు ఉంటాయి. అది నచ్చినా, నచ్చకపోయినా వాస్తవికతను ఎదుర్కోవాలి. కానీ, దురదృష్టవశాత్తు చైనా విషయంలో అలా జరగడం లేదు. 1975-2020 కాలాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. దాదాపు 45ఏళ్లలో సరిహద్దులో రక్తపాతం జరగలేదు. కానీ, 2020లో పరిస్థితులు మారిపోయాయి’ అని జై శంకర్‌ పేర్కొన్నారు.

కార్గో నౌకపై హూతీల క్షిపణి దాడి.. భారత నేవీ డేరింగ్‌ రెస్క్యూ

1993లో బీపీటీఏ, 1996లో వాస్తవాధీనరేఖకు సంబంధించి చేసుకున్న ఒప్పందాలను ప్రస్తావించిన జై శంకర్‌.. పొరుగుదేశంతో చేసుకున్న ఒప్పందాలను చైనా పాటించకపోవడమనేది ఆందోళనకర అంశమేనని అన్నారు. ఇది రెండు దేశాల సంబంధాల్లో స్థిరత్వం, ఉద్దేశాలపై ప్రశ్నను లేవనెత్తుతుందన్నారు. ఐరోపాలో ఘర్షణ, ఆసియాలో అంతర్జాతీయ చట్టాలను పట్టించుకోకపోవడం, మధ్యప్రాచ్యంలో కొనసాగుతోన్న పరిణామాలను చూస్తూనే ఉన్నామన్నారు. అందుకే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా సమతుల్యత పాటిస్తూ ఇతర దేశాలతో భారత్‌ సంబంధాలు కొనసాగిస్తోందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు