Viral video: తిరగబడ్డ ఎలుగు.. పులి పరుగో పరుగు!
close

Published : 20/08/2021 18:50 IST
Viral video: తిరగబడ్డ ఎలుగు.. పులి పరుగో పరుగు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలుగుబంటిపై పంజా విసిరిన పెద్దపులికి షాక్‌ తగిలింది. భల్లూకం నుంచి ప్రతిఘటన ఎదురవడంతో పులి అక్కడి నుంచి పరుగులందుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటరర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. రాజస్థాన్‌లోని రణతంబోర్‌ జాతీయ ఉద్యానవనంలో మూడేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుసాంత నందా గురువారం ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

ఆహారం కోసం అన్వేషిస్తున్న ఓ ఎలుగుబంటిని చూసిన పెద్దపులి దానిని వేటాడాలనుకుంది. భల్లూకం వెనుకవైపు నుంచి చడీచప్పుడు కాకుండా నెమ్మదిగా వచ్చి దానిపై పంజా విసిరింది. అయితే అనుకోని ఉపద్రవానికి వెరవని ఎలుగు.. పులిపై ఎదురుతిరుగుతుంది. ఊహించని ప్రతిఘటన ఎదురుకావడంతో పులి అక్కడి నుంచి పరుగులందుకుంటుంది. ‘ప్రాంక్‌ను ఎలుగుబంటి సీరియస్‌గా తీసుకుంది’ అంటూ సుసాంత నందా షేర్‌ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని