Bihar politics: భాజపాకు నీతీశ్‌ కుమార్‌ ఝలక్‌.. నెట్టింట మీమ్స్‌ హల్‌చల్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌ రాజకీయాలు తీవ్ర ఉత్కంఠకు తెరలేపుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్  ఎన్డీయేకు షాకిస్తూ.. వారితోఉన్న కూటమి బంధాన్ని తెంచుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆర్జేడీ, కాంగ్రెస్‌ సహా ఏడు పార్టీలతో జేడీ(యు) పొత్తుపెట్టుకోనున్నట్లు సమాచారం. ఉత్కంఠకు దారితీస్తున్న బిహార్‌ రాజకీయాలపై #BiharPolitics హ్యాష్‌ట్యాగ్‌తో నెట్టింట మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి.











మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని