Recruitments: సాంకేతిక రంగంలోనే నియామకాల జోష్‌ - More jobs in Tecnology sector
close

Updated : 20/06/2021 13:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Recruitments: సాంకేతిక రంగంలోనే నియామకాల జోష్‌

మిగతా రంగాల్లో కొత్త కొలువులు తగ్గాయ్‌

క్లౌడ్, డేటా ఇంజినీర్, సాఫ్ట్‌వేర్‌   డెవలపర్‌లకు గిరాకీ: నివేదిక

ముంబయి: కొవిడ్‌-19 రెండో దశ పరిణామాల ప్రభావంతో మేలో అన్ని రంగాల్లో నియామకాలు తగ్గినప్పటికీ.. సాంకేతికత రంగంలో పుంజుకున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. చాలా సాంకేతికత రంగ కంపెనీలు విస్తరణ ప్రక్రియలో ఉండటమే ఇందుకు కారణంగా పేర్కొంది. సైకీ (ఎస్‌సీఐకేఈవై) మార్కెట్‌ నెట్‌వర్క్‌ అనే నియామకాల వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. మొత్తం మీద కొత్త ఉద్యోగాల సంఖ్య 2 శాతం తగ్గింది. బ్యాంకింగ్‌ రంగంలో 12%, రిటైల్‌లో 16%, ఎఫ్‌ఎమ్‌సీజీలో 12% చొప్పున కొత్త నియామకాలు తగ్గగా.. బీమా రంగంలో 5 శాతం వృద్ధి ఉంది. అయితే సాఫ్ట్‌వేర్‌ డెవలపర్, క్లౌడ్, డేటా ఇంజినీర్‌ లాంటి ఉద్యోగాలకు అధిక గిరాకీ ఉందని పేర్కొంది. ఈ తరహా విభాగాల్లో నియామకాలు మేలో 12-16 శాతం పెరిగాయి. విక్రయాలు, మార్కెటింగ్, సైట్‌ ఇంజినీరింగ్, మానవ వనరులు, ఫైనాన్స్, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ లాంటి విభాగాల్లో నియామకాలు స్తబ్దుగానే ఉన్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా 10,000 ఉద్యోగ ప్రకటనలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు, తన వెబ్‌పోర్టల్‌లోని వివరాలను ఆధారంగా చేసుకొని సైకీ ఈ నివేదికను రూపొందించింది. 8-12 ఏళ్ల అనుభవం ఉన్న మధ్య స్థాయి ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు, 16 ఏళ్లకు పైగా అనుభం ఉండి నాయకత్వ భాధ్యతలు నిర్వహించే ఉద్యోగాలు వరుసగా 5%; 2% చొప్పున పెరిగాయి. కొత్తవారిని నియమించుకోవడం మాత్రం 4 శాతం తగ్గిందని నివేదిక వెల్లడించింది. ‘లాక్‌డౌన్‌ల కారణంగా చాలా రంగాలకు గడ్డుకాలం ఏర్పడింది. అయితే నియామకాలపరంగా సాంకేతిక రంగంలో మాత్రం కొంత జోష్‌ కన్పిస్తోంది. ఆన్‌లైన్‌ సేవలకు డిమాండు పెరగడం, ఎక్కడి నుంచైనా పనిచేసే విధానాన్ని ఉద్యోగులకు కల్పించడం లాంటి వాటి కారణంగా లాక్‌డౌన్‌ ప్రభావం ఈ రంగంపై పెద్దగా పడలేద’ని సైకీ సహ వ్యవస్థాపకుడు కరుణ్‌జిత్‌ కుమార్‌ ధిర్‌ అన్నారు.


మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని