‘క్రాక్‌’ తరహాలోనే బాలకృష్ణ చిత్రం!
close
Published : 16/02/2021 15:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రాక్‌’ తరహాలోనే బాలకృష్ణ చిత్రం!

‘క్రాక్‌’తో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన సొంత కథతోనే ఆ సినిమాని తీసి సత్తా చాటారు. తదుపరి బాలకృష్ణతో ఆయన సినిమా చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రం కోసం కూడా గోపీచంద్‌ సొంతంగా కథని సిద్ధం చేసుకున్నారు. ‘క్రాక్‌’ తరహాలోనే ఈసారీ నిజజీవిత సంఘటనలతో ఆయన కథని సిద్ధం చేసినట్టు సమాచారం. కథనం, యాక్షన్‌ ఘట్టాలపై ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలుస్తోంది. ‘క్రాక్‌’ చిత్రానికి అవే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేలోనే బాలకృష్ణతో సినిమా పట్టాలెక్కనున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమవుతోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని