నా దావోస్‌ ఖర్చులు వాళ్లే భరించారు: పాక్‌ పీఎం
close
Published : 26/01/2020 01:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా దావోస్‌ ఖర్చులు వాళ్లే భరించారు: పాక్‌ పీఎం

దావోస్‌: ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌) కోసం దావోస్‌ వెళ్లేందుకు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు  స్నేహితులు సహాయం చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆయన దావోస్‌ వెళ్లేందుకు అవసరమయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించలేనందున  ఇద్దరు స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్‌, ఇమ్రాన్‌ చౌదరి ఆ ఖర్చులు భరించినట్లు ఆయన తెలిపారు. దావోస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. వాళ్లు కనుక ఖర్చు పెట్టకపోయినట్లయితే తాను దావోస్‌ రాగలిగే వాడిని కాదన్నారు. 

‘నా స్నేహితుడు షెహగల్‌ రిటైర్డ్‌ మిలటరీ అధికారి, వ్యాపారవేత్తకు కృతజ్ఞతలు. నేను ఇక్కడికి వచ్చేందుకు ఆయన ఎంతో సహాయం చేశాడు. ఇక్కడ రెండు రాత్రులు గడిపేందుకు అయిన 450000 డాలర్లు ఖర్చును మా ప్రభుత్వం మీద భారం వేయలేను. అవి మా ప్రభుత్వం చెల్లించలేదు’ అని ఆయన దావోస్‌లో అన్నట్లు పాక్‌ పత్రిక డాన్‌ పేర్కొంది. పాక్‌ ఆర్థిక పరిస్థితి వల్ల విదేశీ పర్యటనలపై నియంత్రణ ఉన్న విషయం తెలిసిందే. ‘మంత్రులు ఎక్కడికైనా వెళ్తున్నట్లు నాకు చెప్పిన వెంటనే నేను వారిని ఆపుతున్నాను. వాళ్ల పర్యటన దేశానికి ఉపయోగకరమైనదే అని చెప్పి నన్ను ఒప్పించేంత వరకు వారిని వెళ్లనివ్వడం లేదు’ అని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి అధికారిక పర్యటనకు ప్రైవేటు వ్యక్తులు ఖర్చు పెట్టడం ఇదే తొలిసారట. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని