కొవిడ్‌ తగ్గినా... నీరసం పోలేదు?
close
Updated : 27/10/2020 01:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవిడ్‌ తగ్గినా... నీరసం పోలేదు?

నా వయసు 45. ఈ మధ్యే కొవిడ్‌ నుంచి కోలుకున్నా. అయితే విపరీతమైన ఒళ్లు నొప్పులు, చాలా నీరసంగా ఉంటోంది. నా పనులు కూడా చేసుకోలేకపోతున్నా. ఎలాంటి ఆహారం తీసుకుంటే తిరిగి మామూలుగా మారతాను?

-భాగ్య, వరంగల్‌

కొవిడ్‌ మాత్రమే కాదు ఏ వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రభావమైనా కొంతకాలం ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఒంట్లో నిస్సత్తువుగా ఉండటం, కండరాల నొప్పులు, కీళ్ల వాపులు... చూస్తుంటాం. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ కనిపించవచ్చు. ముఖ్యంగా పసిపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, కొవిడ్‌ నుంచి కోలుకున్నవారు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.
రోజూ తప్పనిసరిగా 300 ఎం.ఎల్‌.కు తగ్గకుండా పాలు, పెరుగూ తీసుకోండి. అలాగే కప్పు పప్పుదినుసులూ (దాదాపు 90 గ్రా.) తినొచ్చు లేదా రెండు పూటలా ఉడికించిన గుడ్డు తినండి. బదులుగా 90 గ్రాముల మాంసాహారం తీసుకున్నా మంచిదే. మేలైన కొవ్వుల కోసం నువ్వులు, సోయాబీన్‌ నూనెల్లో వేటినైనా ఎంచుకోవచ్చు. అవిసెగింజలు, వాల్‌నట్‌్్సను తీసుకోవచ్చు. రకరకాల రంగుల్లో ఉండే తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్ల మీద దృష్టి పెట్టండి.  వీటితోపాటు మల్టీ విటమిన్‌ మాత్రలు, విటమిన్‌-డి, ఇ, ఎ, ప్రొబయోటిక్‌, విటమిన్‌-బి సమ్మేళనాలూ అవసరమే. సరైన మోతాదులో నీళ్లూ, పండ్లరసాలు తీసుకుంటేే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి. వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే పదార్థాలు, స్వీట్స్‌, వేపుళ్లు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌ జోలికి వెళ్లొద్దు. కొవిడ్‌ వచ్చిన కొందరిలో ఆకలి ఉండకపోవచ్చు. అయినప్పటికీ ఆహారాన్ని కొద్దిమోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని