Cinema News: ‘ఇదే మా కథ’ కాన్సెప్ట్‌ ఇదే! - telugu news idhe maa katha concept teaser
close
Published : 19/09/2021 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: ‘ఇదే మా కథ’ కాన్సెప్ట్‌ ఇదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాలుగు కథల సమాహారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇదే మా కథ’. శ్రీకాంత్‌, సుమంత్‌ అశ్విన్‌, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గురు పవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురాబోతున్న ఈ సినిమా కాన్సెప్ట్‌ టీజర్‌ని ప్రముఖ నటుడు వెంకటేశ్‌ తాజాగా విడుదల చేశారు. విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్‌ రైడర్ల కథ ఇది. తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమవుతారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో సాగే సంభాషణలు అలరిస్తున్నాయి. పృథ్వీ చేసిన కామెడీ విశేషంగా అలరిస్తుంది. రైడర్లుగా శ్రీకాంత్, భూమిక, సుమంత్‌, తాన్యా ఒదిగిపోయారు. మరి ఎవరి కథ ఏంటి? ఎందుకు వీరంతా ఇంటిని వదిలి వచ్చేశారు? అనుకున్న గమ్యం చేరుకున్నారా? తదితర విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై జి. మహేశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్‌ కశ్యప్‌ సంగీతం అందిస్తున్నారు.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని